కరోనా వ్యాప్తిని నిరోధించటంలో, సామాన్య ప్రజల కోవిడ్ కష్టాలను తీర్చటంలో, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి తన నివాస గృహంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కరోన రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం కరోనా కట్టడి పై మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి అని అన్నారు. చర్యలు మాత్రం చేతులు దాటడం లేదు. వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ప్రభుత్వము దాగుడుమూతల కారణంగా కరోన తో అమాయక పేద ప్రజలు చనిపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ లో అనేక మంది అధికార పార్టీ ముఖ్య నేతల హస్తం ఉందనేది వాస్తవం రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోన కోసం బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారు. అది అంతా పచ్చి అబద్ధం కనీసం 10 శాతం కూడా కేటాయించలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదల రోగులను చేర్చుకో , రోగుల అల్లాడుతుంటే సీఎం గారు ఒక ఆసుపత్రి సందర్శించారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ప్రైవేటు ఆసుపత్రులలో రోగులను చేర్చుకున్నట్లు లెక్కలు చెబుతున్నారు. ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రిలో అయినా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు నిరూపించగలరా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. పేద రోగులకు ఆస్పత్రిలోకి అనుమతించటం లేదు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆక్సిజన్, రెమ్డిసివర్ బ్లాక్ లో అమ్ముకొని దోపిడీ చేసుకోడానికి ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగపడుతోంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి బంధువుల యాజమాన్యాల తో కూడిన ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా ఉన్నాయని వారిపై ప్రేమతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవడం లేదు. 2.3 0 లక్షల కోట్ల తో ప్రవేశపెట్టిన 2021- 22 బడ్జెట్లో ఆరోగ్యానికి ఎంత కేటాయించారు ఈ బడ్జెట్లో మెడికల్ కళాశాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు. ఈ ప్రభుత్వ బడ్జెట్ అంతా వేల కోట్లు సంక్షేమానికి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకొని ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప మరొకటి కాదు.
కరోన నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వెంటనే కరోన అరికట్టేందుకు మూడు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి. కేసులలో జాతీయ స్థాయిలో ఐదు దేవస్థానంలోనూ మరణాల సంఖ్య లో మనం 9వ స్థానంలో ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తిరుపతి హిందూపురం అనంతపురం మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ఆసుపత్రిలో ఆక్సిజన్ మీద ఆధారపడి అనేక మంది రోగులు మరణానికి దారితీసింది. రోగులకు పడకల అందుబాటులో లేవని పేర్కొంటూ చాలా జిల్లాల్లో రోగులు చేర్చుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాకరించాయి. గత ఏడాది మొదటి దశలో వచ్చిన తీవ్ర పరిణామాల తర్వాత కూడా రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసే సామర్థ్యం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సౌకర్యాలు ఆర్ టి కపిసిఆర్ పరీక్షలు చేయడం మానేసి పరీక్షలు ఫలితాలు ఎప్పుడో వెలువరిస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి దిగ్భ్రాంతికరమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నా రోగుల నుంచి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్న ఈ చికిత్స నిర్దేశించిన ప్రైవేట్ హాస్పిటల్స్ వారిపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షకుడిలా చూస్తూ ఈ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాదులో చికిత్స కోసం ఆ రాష్ట్రంలో రోగులను వెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లను తెలంగాణ అభ్యంతరాలు అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వ్యక్తిగతంగా మాట్లాడం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం యొక్క అమానవీయ ధోరణిని విమర్శించడం కానీ చేయకుండా పెదవి విప్పకుండా కూర్చున్నారు. సీఎం జగన్ కేసీఆర్ కు ఎందుకు భయపడుతున్నారు…? తెలంగాణ సీఎం జగన్ కు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు. కరోన వ్యాధి టీకా వేయించటం లో వేగాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఉత్సాహాన్ని చూపించడం లేదు. తాము దేశీయ మరియు అంతర్జాతీయ తయారీదారుల నుండి వ్యాక్సిన్లను సేకరించినట్లు రాష్ట్రం పేర్కొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉత్పుత్తి ప్రకటనలు మరియు తప్పుడు హామీలను తప్ప చర్యల్లో ప్రతిబింబించడం లేదని భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నది.
కేంద్ర అ ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను రాష్ట్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఏపీలో ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రశ్నించిన వారి మీద అ అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వము దినచర్యగా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలోని కరోన నిర్వహణ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూడు కోట్లు అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కోవిడ్ పై పోరాటం లో రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులతో వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రాధాన్యత ఇవ్వవలసిన రంగాలకు ఇవ్వకుండా ముందుకు వెళ్తుంది కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలను సంతుష్టీకరణ కొరకు పాస్టర్స్ మరియు ఇమామ్లకు ఇటీవల జీతాలు పెంచబడ్డ విమర్శలు నివారించడానికి పూజారులకు కూడా జీతాలు పెంచారు. ఖజానా నుండి పాస్టర్స్ మరియు ఇమామ్లకు జీతాలు చెల్లించడంలో ప్రస్తుత వైఎస్ఆర్ మరియు గడిచిన తెలుగుదేశం ప్రభుత్వాలు చేసిన మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మైనార్టీల బుజ్జగింపులు రాజకీయాలను వ్యతిరేకిస్తూనే ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని వనరులను రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగించవలసిన ఈ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం. చర్చి ల నిర్మాణం టెండర్లు ఇవ్వాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణకు అతీతంగా తమ సొంత మత సంస్థలను నిర్వహించే మతాల స్వలాభం కోసం ప్రజాధనాన్ని ఉపయోగించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రధానమంత్రి కేర్ నిధుల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వేలాది వెంటిలేటర్ లను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పంపిస్తే అనేక జిల్లాలలో వాటిని కనీసం ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉంచారు. ప్రభుత్వం చెబుతున్న కారణంగా సాంకేతిక నిపుణులు లేరని ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నేడు వెంటిలేటర్లు లేక కరోనా రోగులు చనిపోతున్నారు. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని ఈ బిజెపి డిమాండ్ చేస్తుందని లేనిపక్షంలో ప్రజలను చైతన్యపరిచి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నివారణ చర్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను తీర్చడానికి భారతీయ జనతా పార్టీ గట్టిగా కృషి చేస్తుంది.