Logo
Date of Publish : 08 May 2021, 7:37 am
Editor : Sake Naresh

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వ విఫలం : జనసేన నాయకుడు లాయర్ జయరాం రెడ్డి

               సెకండ్‌ వేవ్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అనంత జిల్లా జనసేన నాయకులు లాయర్ జయరాం రెడ్డి గారు అన్నారు.  కోవిడ్‌ బారిన పడి వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తే కనీసం పడకలు కూడా సర్దుబాటు చేయలేని దుస్థితి అని అన్నారు.  వైరస్‌ ముదిరి, ఊపిరి ఆడని పరిస్థితుల్లో  ప్రాణాయువు అయిన ఆక్సిజన్‌ను కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం చూస్తోందని జనసేన నేత లాయర్‌ జయరామిరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అళ్ల నాని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రలో హెల్త్‌ ఎమర్జెన్సీ నెలకొని ఉంటే మీరు తీసుకుంటున్న యుద్దప్రాతిపధికన చర్యలేంటని ప్రశ్నించారు. పబ్లిసిటి కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేసి విజయవాడ నుంచి ఊరురా తిప్పిన 101, 108 వాహనాలు. నేడు ఏవయ్యాయని ప్రశ్నించారు. అంబులెన్స్‌ కావాలంటే రూ. 15 వేలు, ఆక్సిజన్‌ కావాలంటే రూ. 15 వేలు, వైద్యం చేయాలంటే లక్షలాది రూపాయాలంటూ వసూలు చేస్తుంటే అసలు రాష్ట్ర౦లో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇక పబ్లిసిటి కోసం అనవసర ఖర్చుచేయడం మాని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని హితవు పలికారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com