విజయవాడ, (జనస్వరం) : వైసీపి ప్రభుత్వానికి, పాలకులకు, అధికారులకు ప్రజల నుండి పన్నులు వసూళ్ళు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రధాన రహదారుల అభివృద్ధిపై లేదని, రహదారులు గుంతలమయంగా మారి ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేనపార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ పోతిన వెంకటమహేష్ గారు ఎద్దేవా చేశారు. పోతిన మహేష్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బంగారయ్య కొట్టు సెంటర్ నుండి చిట్టినగర్ వరకు, చిట్టినగర్ నుండి నెహ్రా బొమ్మ సెంటరు వరకు రోడ్లపై ఉన్న గుంతలను, రహదారుల అధ్వాన స్థితిని, డ్రెయిన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ, వాహనదారులు, పాదచారులు, అనేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు పరిస్థితి దాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రధాన రహదారిలో ప్రయాణం చేస్తున్నామని గగ్గోలు పెడుతున్నారన్నారు. గోతులు పడ్డ రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదాల బారిన పడుతున్నామని కాలువలో మురుగునీరు కూడా సరిగా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ అధికారులకు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ప్రధాన రహదారి బాగు చేయడంపై లేదని, మంత్రి ఇంటి ముందు రోడ్డు బాగుంటే నియోజకవర్గం మొత్తం రోడు బాగా ఉన్నట్లేనని మంత్రి భావిస్తున్నారని, కొద్దిపాటి వర్షానికి చిట్టినగర్ ప్రాంతం మొత్తం జలమయం అవుతుందన్నారు. ప్రతీ రోజూ ఈ ప్రాంతం మీదుగానే మంత్రి వెల్లంపల్లి, పార్టీ మేయర్లు ప్రయాణం చేస్తుంటారని, అయినా, రోడ్లకు కనీస మరమ్మతులు చేయాలనే శ్రద్ద కూడా లేదని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి అవినీతి సంపాదనపై మంత్రి దృష్టి సారించారని ప్రజా సమస్యలును గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో విఎంసి కమిషనర్, విజయవాడ కలెక్టర్ లు తక్షణమే నెహ్రా బొమ్మ సెంటర్ వద్ద నుండి చిట్టినగర్ వరకు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని, మోతీ మసీదు వద్ద శాశ్వత పరిష్కారంగా ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని, అసంపూర్ణంగా వదిలేసిన సైడ్ కాల్వల నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని, లేని పక్షంలో ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోని అధికారపార్టీకి, అధికారులకు కళ్ళు తెరిపించేలాగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరికని నాగమల్లేశ్వరరావు, వేవిన్ నాగరాజు, కొరగంజ. రమణ, బత్తుల వెంకటేష్, రఘు, కుర్మరావు, అదిత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com