Logo
Date of Publish : 22 July 2022, 4:16 pm
Editor : Sake Naresh

పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం : వేమూరు జనసేన నాయకులు

     వేమూరు ( జనస్వరం ) : మండూరు గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాల భవనం స్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థులకి ప్రమాదకరంగా ఉండటంతో స్థానిక జనసేన నాయకులు పరిశీలించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పాఠశాల నూతన భవనం నిర్మించాలని మండలం విద్యాధికారి రవికాంత్ ని కోరటం జరిగిందన్నారు. పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితిలో ఈ పాఠశాల భవనాలు ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వంకు పట్టింపు లేనట్లుంది. నాడు నేడు కార్యక్రమం అని ప్రభుత్వం గొప్పగా చెప్పడం చూస్తే ప్రజల్ని మభ్యపెట్టేవిధంగా ఉందన్నారు. ఒకసారి చుండూరు పాఠశాలను పరిశీలించి తగిన కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలం అధ్యక్షులు శ్రీరామమూర్తి, జిల్లా కార్యదర్శులు చేబ్రోలు బోడియ్య, సోమరౌతు అనురాధ, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, యాసం జగదీష్, బత్తుల అనిల్, మనీష్, సాయి బాలాజీ, కెళం నాగయ్య, యాసం అనిల్, రెడ్డి శ్రీను, నాగూర్ జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com