ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఏ ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తామొ జాబ్ కార్డు ద్వారా తెలియజేస్తామని చెప్పి, ఈ రోజు రెండు సంవత్సరాల తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 36 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని అనడం హాస్యాస్పదం అన్నారు. ఉద్యోగాలు కేవలం 450 మాత్రమే భర్తీ చేస్తామని, చెప్పడం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ తెలియజేశారు. ఇంతవరకూ ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ఉత్త ప్రకటనలు చేశారు. అవన్నీ వాస్తవాలు కాదు కేవలం నిరుద్యోగ యువతను మోసం చేయడమే. మీరు నియమించిన వాలంటీర్లు జీతం పెంచమని అడిగితే మీరు కేవలం స్వచ్ఛంద సేవకులు మాత్రమే ఉద్యోగస్తులు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు రాక ముందు నుంచి ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఉద్యోగులను కూడా మీరు వచ్చిన తర్వాత నియమించినట్లు మీరు చెప్పుకుంటున్నారు. అలాగే ఇంతవరకు డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు, దాని గురించి ఉలుకు లేదు పలుకు లేదు. ఇదంతా చూస్తుంటే మీరు మాట తప్పి మడమ తిప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లే ఉంది. జనసేన పార్టీ తరఫున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఏ ఏ డిపార్ట్మెంట్ లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో శ్వేత పత్రం విడుదల చేయాలని అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, లేనిపక్షంలో ఆ నిరుద్యోగ యువత సరైన టైంలో మీకు సమాధానం చెబుతుందని తెలియజేస్తున్నాం అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com