
కదిరి ( జనస్వరం ) : పేద ముస్లిం కుటుంబానికి వివాహ సమయంలో పెళ్లికూతురుకు పెళ్ళి ఖర్చులకు గాను దుల్హన్ పథకం ద్వారా గత ప్రభుత్వం 50 వేల రూపాయలు వారి అకౌంట్ నందు జమ చేసేది. మన ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల ప్రచార సమయంలో ఆ అమౌంట్ రెండింతలుగా ఇస్తానని హామీ ఇచ్చి, తను అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీని మరచిపోయి, ఆ పతకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని హైకోర్టుకు తెలపడం ఎంత వరకు సమంజసమని, మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి గారు ఇలా చేయడం మాట తప్పడం కాదా అని జనసేన పార్టీ కదిరి ఇన్చార్జి భైరవ ప్రసాద్ తెలిపారు. అలాగే ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా గాని తన ఎన్నికల హామీలో ఇచ్చిన ముస్లిం బ్యాంకు ఏర్పాటు గాని, ఇంతవరకు అమలు చేయలేదని ఇది ముస్లిమ్స్ కు ద్రోహం చేయడం కాదా అని వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ముస్లిమ్స్ ను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు గాని, వారికిచ్చిన హామీలను అమలు చేయలేదని,మీరు తప్పకుండా దులహన్ పథకాన్ని పునరుద్ధరించాలని, అలాగే వారికిచ్చిన ఎన్నికల హామీలు అమలు పరచాలని కదిరి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అంజి బాబు పాల్గొన్నారు.