అరకు, (జనస్వరం) : అధికారంలో వచ్చిన వారం రోజుల్లో సిసిఎస్ రద్దు చేస్తామని, ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని జనసేన నాయకులు సాయిబాబా, దురియా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆనాడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈనాడు మాట మార్చడం సబబుకాదు అని, అధికారం లేనప్పుడు ఒక మాట, వచ్చాక మరో మాట మాట్లాడడం జగన్ రెడ్డి నైజం ఇదేనా అని, ఇది మోసపూరిత చర్యగానే జనసేన పార్టీ భావిస్తోందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి కానీ అందుకు విరుద్ధంగా జీతాలు తగ్గించడం ఉద్యోగాలను వంచనకు గురి చేయడం సరి కాదు. మండుటెండల్లో నిలబడి లక్షలాది మంది ఉద్యోగస్తులు నిలబడి నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసిన పాపానికి వేలాది మంది ఉద్యోగస్తులకు అక్రమంగా అరెస్టు చేయడం, లాఠీఛార్జి చేయడం దురదృష్టకరమని, ఇటువంటి ధోరణి జగన్ రెడ్డి పాలనలో చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సిపిఎస్ ను రద్దు చేయాలి. లేనిపక్షంలో రానున్న రోజుల్లో వైయస్సార్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని, ఉద్యోగస్తులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, వారికి ఎల్లవేళలా అండదండగా ఉంటుందని జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా ఈ సందర్భంగా పత్రిక ప్రకటనలు ద్వారా తెలిపారు.