
నెల్లూరు, (జనస్వరం) : పెంచిన విద్యుత్ బిల్లులు మొదలు ఖర్చులన్నీ పెరిగిపోగా ప్రభుత్వం మద్దతు ఇచ్చి లాభసాటి ధర కల్పించక ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఉందని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ తెలిపారు. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఆక్వా సాగు చేస్తే కనీస గిట్టుబాటు ధర రాక రైతులు ఆవేదన చెందుతున్నారు అంటూ జిల్లా ఆక్వా రైతులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ని సంప్రదించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం రూపంలో ఆయనకు ఇచ్చారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు
ఆక్వా రైతుల సమస్యలు
1. సీడ్ నాణ్యత కలిగి ఉండాలి. (ప్రభుత్వ పరిధిలో)
2. ఫీడ్ (మేత) ధరలు అదుపులో ఉండాలి.
3. కెమికల్స్ ధరలు విపరీతంగా పెంచారు. ధరలు అదుపు చెయ్యాలి.
4. కరెంటు ధరలు రకరకాల కండీషన్లు పెట్టు పెంచుతున్నారు.
(1)ఎలక్షన్ ముందు ఒక్క యూనిట్ ధర 1.50 పైసలు ( 24 గంటలు ) అని చెప్పిన ప్రభుత్వం..ఇప్పుడు రూటు మార్చి 40HP కి కంటే ఎక్కువ వాడితే 4 రూపాయలు యూనిట్ ధర అని చెప్తుంది.
(2) ఆక్వారంగం ముఖ్యంగా కరెంటు మీద ఆధారపడి ఉంటుంది. కరెంటు కోతలు భారీగా పెరిగాయి. అవి తగ్గించాలి.
5. ఇన్ని కష్ట నష్టాలకు ఓర్చి కల్చర్ వేస్తే పట్టుదల అప్పుడు రకరకాల కౌంట్ పేరు చెప్పి రైతులను మోసం చేస్తున్నారు. రైతులకు లాభసాటి ధర కల్పించాలి.
6. గత ప్రభుత్వం రైతులకు ఏరియేడర్లు, జనరేటర్ సబ్సిడీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది.
7. డీజిల్ రేట్లు , కరెంటు రేట్లు , పిల్లల రేట్లు , మేత రేట్లు , మందుల రేట్లు , పెంచిన ప్రభుత్వం..రొయ్యల ధరలు మాత్రం పెంచలేదు.
ఈ సందర్భంగా మనుక్రాంత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏ రంగం కూడా అభివృద్ధికి నోచుకోలేదని సరైన వసతులు, ఆర్థిక సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ మూడు సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి శూన్యం. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సమస్య సాధించేవరకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.