రైల్వే కోడూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దలను కలిసి జనసేన బిజెపి భవిష్యత్ కార్యాచరణ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంశంగా ప్రజా పీడిత ప్రభుత్వంగా మారిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని కలిసిన అనంతరం మీడియాతో చెప్పడం జరిగింది. రైల్వే కోడూరు నుంచి కూడా నాలుగు పర్యాయములు గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన కొరముట్ల శ్రీనివాసులు గారిని కుర్చీ దించే విధంగా జనసేన పోరాటం చేస్తున్నామని పత్రికా ముఖంగా తెలుపుతున్నాము. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండేలా పోరాటం చేయలేక చేతులెత్తేసి కోడూరు రాజంపేట నియోజకవర్గ ప్రజల మనోభావాలను తుంగలో తొక్కిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరినీ బాయికాట్ చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలిపిస్తున్నాము. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదానికి అనుగుణంగానే రైల్వేకోడూరు నుంచి జనసేన తరఫున పోరాటాలు ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కోడూరు జనసేన సీనియర్ నాయకులు ఉత్తరాది శివకుమార్, మర్రి రెడ్డి ప్రసాద్, వర్ధన గారి ప్రసాద్, నగిరిపాటి మహేష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com