తిరుపతి, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నిన్న పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు దీటుగా జనసేన నాయకులు జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, రాష్ట్ర జిల్లా నాయకులు పగడాల మురళి, ఆకేపాటి సుభాషిని, మునస్వామి, కీర్తన, లక్ష్మి, పార్థు, కిషోర్, లోకేష్, మనోజ్ తదితరులతో కలిసి సోమవారం ఓ ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు చేయలేనిది మా అధినేత పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన 3000 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తుంటే చూసి సహించలేక మా నాయకుడిపై కుట్ర బుద్ధితో విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి నాని ని ఒకటే అడుగుతున్నాం అసలు మీకు విలువలు ఉన్నాయా, మీకు మీ ఇంట్లో విలువ లేదు, నువ్వు భజన చేస్తున్న మీ పార్టీలో కూడా విలువ లేదు, విలువ లేని మనిషి నువ్వు నీ గురించి మాట్లాడడం మా కర్మ అని అన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి వేసిన కుక్క బిస్కెట్లు తిని మా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే నీకు మంత్రి పదవి పోయింది అన్న విషయాన్ని మరిచిపోతున్నారని రేపు రాబోయే రోజుల్లో మీకు టికెట్ రావాలని మళ్లీ మా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు కానీ ఈసారి మీకు టికెట్ కూడా రాదు అని పొత్తుల గురించి నిన్ననే మా నాయకులు క్లారిటీ ఇచ్చారని ప్రతి సారి మీరు సింగల్ గా రండి సింగల్ గా రండి మేము సింహంలా సింగిల్ గా వస్తాం అని అంటున్నారు. ఈసారి మీ సింహాన్ని ప్రజలు బోనులో పెడతారు అని రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం మిలా ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా లలో సంపాదించిన డబ్బులు కాకుండా సొంత నిధులతో రైతులకు సహాయం చేస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి అని మమ్మల్ని ప్రత్యేకహోదా తీసుకొని రావాలని అంటున్నారు మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు ఏం చేస్తారు మా ఇళ్ళల్లో పాచి పని చేస్తారా అని అన్నారు. అదేవిధంగా 2014లో స్పెషల్ స్టేటస్ కోసం మోడీకి ఎదురుతిరిగిన ఒకే ఒక నాయకుడు మా నాయకుడు అని మాట తప్పడు మడమ తిప్పుడు అని 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మీరు ఏం చేశారని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే వారికి బాటిల్ రూపంలో గోల్డ్ మెడల్ లను ప్రెసిడెంట్ మెడల్ అనే దాని అర్థం కూడా తెలియకుండా యువతకు అందిస్తున్నారని మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదు, మా పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారని, భవన నిర్మాణ కార్మికుల వైపు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని యువతకు, రైతులకు, ప్రజలకు అండగా నిలబడిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ ఒక్కరేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బకాసురుడు లాంటి జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని, అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర పేరుతో తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారని మా నాయకుడు ప్రజలకు మత్రమే దత్త పుత్రుడు అని రేపు రాబోయే ఎలక్షన్లలో మీయొక్క 151 సీట్లును 15 సీట్లుకే జనసేన పార్టీ పరిమితం చేయబోతోందని జోస్యం చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com