చింతకుంట ( జనస్వరం ) : చింతకుంట గ్రామపంచాయతీ పశువులేటివారిపల్లెలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఉత్తర్వులు మేరకు, మండల కమిటీ మండల అధ్యక్షుడు సమావేశంలో నిర్వహించడం జరిగింది. సభ నిర్వహించబడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు వైసీపీ, టిడిపి కార్యకర్తలు జనసేనలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి మండల ప్రెసిడెంట్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చింతకాయల కృష్ణ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, నా సేన నా వంతు కార్యక్రమాన్ని ప్రజలేకి తీసుకెళ్లాలని, అలాగే పార్టీని బలోపే దిశగా ప్రయాణించాలని, ప్రతి ఒక్కరికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. మిగతా జనసేన నాయకులు మాట్లాడుతూ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి పార్టీలో చేరడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. నేడు పార్టీలోకి చేరిన వారిలో అధికమంది యువత ఉండడం శుభపరిణామమని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపిచ్చారు. జనసేన నాయకులు ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు గ్రామాల్లో తిరిగి, ప్రజలను ఉత్తేజపరిచి, రాబోయే 2024లో పవన్ కళ్యాణ్ సీఎం చేసే విధంగా ప్రయత్నించాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ జనసే న నాయకులు చింతకాయల కృష్ణయ్య, ఎర్ర వారి పాలెం మండల ప్రెసిడెంట్ ముండ్లపాటి మురళి, జిల్లా సెక్రెటరీ కలప రవి, పోటుకూరి ఆనంద్, శ్రీమతి బీగాల అరుణ, మండల ఉపాధ్యక్షులు ఎర్ర నరేంద్ర, జనరల్ సెక్రెటరీ గుర్రం విశ్వనాథ్, సెక్రటరీస్ ముని సురేష్ వై బాలా పి సుబ్బు, మరియు ఎర్రవారిపాలెం జన సైనికులు వీర మహిళలు, చిన్న గొట్టిగల్లు మండల ప్రెసిడెంట్, యశ్వంత్, మరియు జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.