Logo
Date of Publish : 15 November 2021, 8:08 am
Editor : Sake Naresh

చిత్తూరు జనసేనపార్టీలోకి పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో చేరిన వైసీపీ కార్యకర్తలు

            తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బలంగా పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలో చేరుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం దామలచెరువు పంచాయతీకి చెందిన దాదాపు 100 మంది వైయస్సార్సీపీ యువనాయకులు జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ.డా.పసుపులేటి హరిప్రసాద్  సమక్షంలో చేరారు. చంద్రగిరి చిత్తూరు జిల్లా కార్యదర్శి యం.నాసీర్, సహాయ కార్యదర్శి శ్రీమతి బీగాల అరుణ గార్ల ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చరణ్ రాయల్, నాగూరు బాషా, రహంతుళ్ళ, మస్తాన్, నౌమూన్, హరి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com