●ఏలూరు నియోజకవర్గ జనసేనపార్టీ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు, (జనస్వరం) : మొన్న కోడికత్తితో పొడిపించుకోవడం దగ్గర నుంచి బాత్రూంలో బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటుగా చెప్పడం వరకు, వైసీపీ నాయకత్వం మొదటి నుంచి కుట్ర సిద్ధాంతాన్నే నమ్ముకుందని జనసేనపార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. కోనసీమ అల్లర్లు, తుని రైలు దగ్ధం, ఘటనలోనూ వైసిపి ఇదే కుతంత్రాలు, అలజడులతోనే రాజకీయం చేయాలని చూశారని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు కొత్తపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ సీఎం సొంత చెల్లెలు ఢిల్లీ వేదికగా కడప ఎంపీ టికెట్ కోసం బాబాయ్ హత్య జరిగిందని చెబుతున్నారు. కోనసీమ అల్లర్లకు కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. మొదటి నుంచి కుట్రలనే నమ్ముకున్న వైసీపీ ఇప్పుడు ఇంటిలిజెన్స్ నివేదిక పేరుతో కొత్త కుట్రకు తెరలేపుతోందని, జనసైనికులకు పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ నేర్పించారన్నారు. ప్రజా పోరాటాలను ఎంత సమర్థంగా, ప్రజాస్వామ్యయుతంగా చేయాలో నేర్పించారంతే తప్ప ప్రజాప్రతినిధులపై దాడులు చేసే ఆలోచన ఎన్నటికీ జనసైనికులకు రాదన్నారు. ఇంటిలిజెన్స్, నివేదికలు వస్తే, దాన్ని మీడియాకు ఎలా బయట పెడతారు? ఈ నాటకాలను,కుట్రలను కచ్చితంగా తిప్పికొడతామన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా వీధి దీపాలు కూడా ఆర్పేసి, ఏమీ చేయాలనుకున్నారో, ఎలాంటి అలజడులు రేపి గందరగోళం చేయాలనుకున్నారో ప్రజలు గ్రహించారన్నారు. మీరే దాడులు చేయించుకొని, మీ వారితోనే గొడవలు రేపి, దాన్ని జనసేనపై నెట్టేయాలని వైసిపి చేస్తున్న ఈ కొత్త కుట్రలు జన సైనికులకు తెలియనివి కావని, నిజాయతీ, నిబద్ధతతో పనిచేసే నాయకుడి అడుగుజాడల్లో నడుస్తున్న జనసేనపార్టీ కార్యకర్తలు ఎప్పటికీ క్రమశిక్షణ తప్పరన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేవలం బూతులు తప్ప శాఖలపై పట్టులేదని,వారి శాఖల్లో ఏ జరుగుతుందో మంత్రులకు తెలియదన్నారు. ఈ బూతులు మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే, ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, వైసిపి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పనులు చేయరు. ప్రజల్లోకి వెళ్లరు గానీ జనసేనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వ లేకపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి నేరచరిత అందరికీ తెలుసని, మిగిలిన వారు ఆయన బాటలోనే పయనిస్తున్నారన్నారు. జనసేనపార్టీ నాయకులు, శ్రేణులు ఎప్పటికప్పుడు జాగురూకతతో మెలిగి, అధికార పార్టీ చేస్తున్న ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని అప్పలనాయుడు సైనికులకు పిలుపునిచ్చారు.