-ఈ ప్రాంతంలోకి వెళ్ళే రోడ్డు పూర్తిగా దెబ్బతింది
-ఇళ్ళను ఆనుకుని కరెంట్ తీగలు
-ఇళ్ళ ముంగిటే కరెంట్ స్థంభాలు ఉండడంతో గతంలో ఓ బాలిక షాక్ తగిలి మృతి చెందింది
-ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి నెల్లూరు సిటీలో పేదల ఇళ్ళు పగలగొడుతూ మూడు కాలువల రీటెయినింగ్ గోడల బినామీ కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ నమ్మి ఓట్లేసిన ప్రజల సమస్యలను తీర్చడం మీద లేదు
-పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి
---------------------
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 103వ రోజున 13వ డివిజన్ యలమవారిదిన్నెలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ యలమవారిదిన్నెలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయని అన్నారు. నెల్లూరు నగరంలో జాతీయ రహదారి దాటి ఈ ప్రాంతానికి చేరుకునే రోడ్డు అధ్వాన్నంగా తయారై ఉందని, బాగుచేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రాంతంలో కరెంట్ స్థంబాలు ఇళ్ళ ముంగిట ఉన్నాయని, కరెంట్ తీగలు ఇళ్ళను ఆనుకుని ఉన్నాయని, ప్రజలు అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదని, జనసేన పార్టీ తరఫున ఈ సమస్యపై పోరాడుతామని అన్నారు. గతంలో ఇంటి ముందు ఆటలాడే ఓ బాలిక కరెంట్ స్థంభానికి తగిలి షాక్ తో మరణించిందని, ఆ చిన్నారి తల్లిదండ్రుల వేదన తనకు ఎంతో బాధ కలిగించిందని కేతంరెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలందరూ గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలబడి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపులో కీలకపాత్ర పోషించారని, ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజల సమస్యలను, అభివృద్ధిని గాలికొదిలేసి నెల్లూరు సిటీలో పేదలకు ఎటువంటి ఆసరా చూపకుండా ఇళ్ళు పగలగొడుతూ మూడు కాలువల రీటెయినింగ్ గోడల బినామీ కాంట్రాక్టుల దోపిడీ పైనే తన పూర్తి దృష్టి పెట్టి ఉన్నాడని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినా ఈసారి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజలందరి ఆశీస్సులతో గెలిచేది జనసేన పార్టీయే అని, పవనన్న ప్రభుత్వంలో నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపెడతానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు భరోసా కల్గించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com