ఆచంట ( జనస్వరం ) : గుమ్మలూరు ప్రాథమిక పాఠశాలలో యల్. పి. యఫ్ ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ జనసేన పోడూరు మండల అధ్యక్షులు రావి హరీష్ బాబు ఆధ్వర్యంలో సావిత్రి భాయ్ పూలే జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా యల్. పి. యఫ్ చైర్మన్ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారత దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తల్లి రామాబాయి గారి జీవితం ఆదర్శనీయం అని ప్రతికూల పరిస్థితి లో ఆమె చదువు కోసం చూపిన తెగువ, చదువు అనే జ్యోతి సామాన్యుల ఇళ్లల్లో వెలుగులు నింపాలని ఆమె చేసిన ప్రయత్నాలు నిత్య స్మరనీయం అని తల్లి రామాబాయి లా పిల్లలంతా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి భ్రమరాంభ గారిని సాలువాతో సత్కరించి పూలమాలతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమం లో టీచర్ శాంతా గ్రేస్, వర్ధనపు శ్రీనివాస్ జనసేన నాయకులు కడలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com