Logo
Date of Publish : 27 May 2021, 3:30 pm
Editor : Sake Naresh

చేనేత కుటుంబానికి చేయూతనిచ్చిన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్

    చేనేత కుటుంబానికి జనసేన నేత చేయూత

• తక్షణ సాయంగా రూ. 25 వేలు అందచేత
• కుటుంబ సభ్యులకు పరామర్శ
• మరింత భరోసా కల్పిస్తామని శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ హామీ

                     వైసీపీ ప్రభుత్వంలో చేనేతలకు చేయూత కరువయ్యిందని పెడన నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీ నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ ఆరోపించారు. కుటుంబానికి కరోనా వ్యాధి సోకితే కనీసం భరోసా ఇచ్చే యంత్రాంగం కూడా పెడన నియోజకవర్గంలో కరువయ్యిందన్నారు. గురువారం కరోనా సోకిందని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కళాకారుడు శ్రీ లీలాప్రసాద్, శ్రీమతి భారతీల కుటుంబ సభ్యులను రామ్ సుధీర్ పరామర్శించారు. తల్లిదండ్రుల మరణంతో అనాధలైన చిన్నారులను పలుకరించారు. తక్షణ సాయంగా ఆ కుటుంబానికి రూ. 25 వేల ఆర్ధిక సాయం అందించారు. అనంతరం శ్రీ రామ్ సుధీర్ మాట్లాడుతూ.. పెడన నియోజకవర్గంలో కరోనా నివారణ చర్యలు దారుణంగా ఉన్నాయి. బాధితులు ఎంతటి దయనీయ పరిస్థితుల్లో వ్యాధితో పోరాడుతున్నారు అన్న దానికి శ్రీ లీలాప్రసాద్ దంపతుల ఆత్మహత్యే నిదర్శనం. ప్రజలు చనిపోతుంటే ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో కోవిడ్ సెంటర్ల ఏర్పాటుకు పోటీ పడుతుంటే శ్రీ జోగి రమేష్ గారికి మాత్రం ప్రజల వెతలు అస్సలు పట్టడం లేదు. పెడన నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కలంకారీ చేనేత కళాకారులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా మహమ్మారి వారి జీవితాలను చిద్రం చేసేసింది. తయారు చేసిన వస్త్రాలు అమ్ముకునే పరిస్థితులు లేక ఎన్నో కుటుంబాలు పూటగడవని స్థితిలో ఉన్నాయి. వీటికి తోడు ఎప్పటిలాగే వేసవిలో నీటి లభ్యత సమస్య. ఇప్పటికే చాలా కుటుంబాలు మగ్గాలు పక్కన పెట్టేశాయి. ఈ ప్రభుత్వ విధానాల దెబ్బకి కలంకారీ కళ ఉనికిని కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి. కరోనా కష్టకాలంలో చేనేత కళాకారులకు ప్రత్యేక భృతి ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. శ్రీ లీలాప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా నిలుస్తాం. భవిష్యత్తులో మరింత సాయం చేస్తాం. పిల్లల చదువులకు కూడా సాయం చేస్తాం. కరోనా సోకిన వారు ధైర్యంగా వ్యాధిని ఎదుర్కోండి. ఇలాంటి నిర్ణయాల వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఏ ఒక్కరూ కూడా మనోధైర్యం కోల్పోవద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పడవల మోహన్ త్రినాథ్ గారు,, అంజిబాబు, పవన్ మరియు పోలవరం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com