గంగాధర నెల్లూరు ( అనంతపురం ) : ఎస్ఆర్ పురం మండల కేంద్రం, జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులు సమావేశం జరిగింది. వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీనిపై డాక్టర్ యుగంధర్ పొన్న స్పందిస్తూ పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేకపోవడం వల్లే జగన్ చెత్తచెత్తగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చెత్త ముఖ్యమంత్రి జగన్ అని, అసమర్ధ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు మా అధ్యక్షులు ప్రశ్నించినది ఏమిటి... వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఎఫ్.ఓ.ఏ. అనే కంపెనీలో ఎందుకు ఉంది? ఆ కంపెనీ ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? అని అడిగారు. వాలంటీర్లలో కొంతమంది, మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు గురి చేయడం, వివాహితల కాపురాలు కూల్చడం నిజం కాదా? అని వీరి వేధింపులకు, అత్యాచారాలకు బాధ్యులు ఎవరు? అని అడిగారు. వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి? ఏ మంత్రి బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. వ్యక్తి ఆధార్, బ్యాంక్ వివరాల నుంచి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, ఎవరు ఎక్కడికి, ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు, అవివాహిత మహిళలు, ఒంటరి మహిళలు యువతుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న మాట నిజం కాదా? అని అడిగారు. మహిళలు, యువతుల వివరాలు ఏ ఉద్దేశంతో తీసుకొంటున్నారు? వాలంటీర్లకు ఐడీ కార్డులు కూడా లేవు అనేది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న సీరియస్ విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఆ విషయాన్ని మరుగునపెట్టేందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు హరీష్, అవినాష్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగర్ మండల బూత్ కన్వీనర్ అన్నామలై, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల కార్యదర్శి చిరంజీవి, ఎస్ఆర్ పురం మండల కార్యదర్శి హరీష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com