Logo
Date of Publish : 01 December 2023, 10:15 pm
Editor : Sake Naresh

జనసేన వారియర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

   గుడివాడ ( జనస్వరం ) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ బాధితులకు పౌష్టిక ఆహారాన్ని గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ అందించారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఎయిడ్స్ బాధితులకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆస్పటల్ సూపర్డెంట్ ఇందిరాదేవి గారు మాట్లాడుతూ ప్రతి మనిషి సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలని గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమలు చేస్తూ ముందుకు వెళుతున్న ఆర్కే వారియర్స్ కి మా ఆసుపత్రి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించి తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మీ అందరికీ మేము తోడుగా ఉంటామని తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి మా కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో సమాజానికి సేవ చేయాలనే ఆకాంక్షతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చాలామంది ఎయిడ్స్ రోగి అంటే అంటరాని వాళ్ళ లాగా దూరంగా ఉంచుతున్నారని అలా కాకుండా మందులతో పాటు మనం మనోధైర్యం ఇస్తే వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారని అనే ఆలోచనతో ఈరోజు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేసి వారికి మేము ఉన్నామని బొరాస ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ఇందిరా దేవి గారికి మా ఆర్కే వారియర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ్, గంట అంజి శివ చరణ్ మరియు ఆర్కే వారియర్స్ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com