గుడివాడ ( జనస్వరం ) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ బాధితులకు పౌష్టిక ఆహారాన్ని గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ అందించారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఎయిడ్స్ బాధితులకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆస్పటల్ సూపర్డెంట్ ఇందిరాదేవి గారు మాట్లాడుతూ ప్రతి మనిషి సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలని గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమలు చేస్తూ ముందుకు వెళుతున్న ఆర్కే వారియర్స్ కి మా ఆసుపత్రి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించి తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మీ అందరికీ మేము తోడుగా ఉంటామని తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి మా కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో సమాజానికి సేవ చేయాలనే ఆకాంక్షతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చాలామంది ఎయిడ్స్ రోగి అంటే అంటరాని వాళ్ళ లాగా దూరంగా ఉంచుతున్నారని అలా కాకుండా మందులతో పాటు మనం మనోధైర్యం ఇస్తే వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారని అనే ఆలోచనతో ఈరోజు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేసి వారికి మేము ఉన్నామని బొరాస ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ఇందిరా దేవి గారికి మా ఆర్కే వారియర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ్, గంట అంజి శివ చరణ్ మరియు ఆర్కే వారియర్స్ సభ్యులు పాల్గొన్నారు.