Logo
Date of Publish : 20 September 2023, 9:56 pm
Editor : Sake Naresh

మహిళా రిజర్వేషన్ బిల్లు హర్షనీయం : జనసేన పార్టీ నేత సోమ రౌతు అనురాధ

    వేమురు ( జనస్వరం ) : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటం హర్షనీయమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమ రౌతు అనురాధ పేర్కొన్నారు. బుధవారం వేముల విలేకరులతో మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని, అనేక సందర్భాల్లో వివిధ పార్టీలు మహిళా రిజర్వేషన్లు బిల్లుపై మాటలు వరకే చెప్పారు గానీ నేటి వరకు రూపు దాల్చలేదు అన్నార., ఈనాడు ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టడం అభినందనీయమన్నారు. దీని ద్వారా మహిళలు చట్టసభల్లోనూ ఇతర రంగాల్లోనూ కూడా ఒక శక్తిగా ఎదిగేందుకు తోడ్పడుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దేవ గౌడ ప్రధానిగా ఉన్న కాలంలోనే పార్లమెంటులో చర్చకు వచ్చిందని కానీ ఆనాడు కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం ద్వారా ఆగిపోయింది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా కేంద్ర క్యాబినెట్ నేడు బిల్లు ఆమోదింపబడటం మహిళలు గర్వించదగిన విషయమని అనురాధ పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలు రాజకీయంగా మరింత ఎదిగి రాజ్యాధికారంలో పాలుపంచుకునే అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పాటునిస్తుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందుకోసం ప్రత్యేకతలు చూపుతారని అనురాధ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో కూడా పూర్తిగా ఆమోదం పొందని దీమ వ్యక్తం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com