Logo
Date of Publish : 30 January 2023, 10:52 am
Editor : Sake Naresh

జనసేన పార్టీతోనే రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, మహిళా సాధికారత సాధ్య౦ : గుంటూరు జనసేన వీర మహిళలు

            గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీతోనే రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, మహిళా సాధికారత సాధ్యమని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జనసేన మహిళా విభాగం ఆధ్వర్యంలో వీర మహిళల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, అడుగడుగునా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు అండగా ఉండే విధంగా వీర మహిళలు గ్రామస్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం చేయాలని, రానున్న ఎన్నికలలో జనసేన పార్టీని అధికారంలో తెచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే విధంగా వీర మహిళలు కృషి చేసి పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని బిట్రగుంట మల్లిక పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా విభాగం నేతలు రావి రమ, బడే కోమలి, సోమరాతు అనురాధ, పోకల కమల, వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com