హనుమకొండ ( జనస్వరం ) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ ఆదేశాల మేరకు జిల్లా కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా వీరమహిళలు కేక్ కట్ చేసి మిఠాయులు పంచిపెట్టారు. వీర మహిళలు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల దూసుకుపోతున్నా, అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా మహిళలు ముందుకు వెళుతున్నా కూడా ఎక్కడో ఒకచోట మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. లింగ సమానత్వం లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. లింగ సమానత్వం పై అవగాహన కల్పిస్తూ లింగ సమానత్వం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ, ఉపాఅధ్యక్షులు తాళ్లపెల్లి బాలు గౌడ్, కార్యదర్శి, శేషాద్రి సందీప్, యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబెర్ వస్కులా నిఖిల్ చోప్రా, వరంగల్ జిల్లా నాయకులు గోపు నవీన్, మనోజ్, అనిల్, దయాకర్, కుమార్, శివ, అనుదీప్, నర్సంపేట నాయకులు మెరుగు శివకోటి, వీరామహిళలు స్వప్న, అనిత, ఆశజ్యోతి, సుమలత, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com