Logo
Date of Publish : 04 February 2024, 7:56 pm
Editor : Sake Naresh

మహిళలు ఆలోచించి ఓటువేసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు దోహద పడాలి

    అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 8వ డివిజన్ రాణి నగర్ నందు 21వరోజు మహిళలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలతో మమేకమై మాట్లాడుతూ జగన్ మాయమాటలు నమ్మి ఓటు వేసినందుకు రాష్ట్రం 30 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి వెళ్లిందని అన్నారు. కనుక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్నిరంగాలు పురోగమించాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యమవుతుందని అన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపాడని యువతకు ఉద్యోగాలు కూడా లేవని కనుక ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ పార్టీలకే ఓటు వేయాలని కోరారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో లోని ముఖ్యంశాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు, దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు, 20లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను వివరించారు.  ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని వీటితో పాటు స్థానిక డివిజన్ లో మంచినీటి సరఫరా, వీధిదీపాలు, ముతుగుకాలువలు రహదారులు సరిగా లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com