చిత్తూరు జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి కీర్తి గారు పత్రికా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ప్రభుత్వంకు చిత్తశుద్ది లేదని ధ్వజమెత్తారు. గుంటూరులో దళిత విద్యార్థిని రమ్య హత్య కేసుపై స్పందిస్తూ గాంధీగారు అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్చగా బయట తిరిగినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల అయినా పట్ట పగలు బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తామో, రామో అని తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. చట్టాలు బలంగా మరియు త్వరితగతిన పని చేయనంత కాలం ఇవి మారవు. అమాయకమైన ఆడబిడ్దలు బలైపోతూనే ఉంటారు. ఘటనలు జరిగిన ప్రతిసారి బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి, అమలులేని దిశ చట్టాల గురించి చెప్పి ఇన్ని రోజుల్లో శిక్ష పడుతుందని చెప్పి కుటుంబాలను మోసం చేసి, ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని ఆమె తెలిపారు. మరి ఈ ఘటనను అవకాశంగా తీసుకుని ప్రతిపక్ష తెలుగుదేశం శవ రాజకీయం చేస్తుందని, నిన్న గుంటూరులో నారా లోకేష్ గారు ఆడబిడ్డకి కష్టం వస్తే తగ్గేదే లేదు అని ప్రచారాలు చేస్తున్నారని, మీ ప్రభుత్వ హయాంలో మీ నాన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూల్ లో సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డ ఉరేసుకుని చనిపోతే అప్పుడు, ఇప్పటికి మీరు అందుకు మాట్లాడలేదని ఆ బిడ్డ తరుపున మీరు ఎందుకు పోరాటం చేయటం లేదు అని, ఆ బిడ్డ కి ఒక న్యాయం, ఈ ఆడబిడ్డకి ఒక న్యాయమా అని జనసేన పార్టీ తరుపున నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం అని ఆమె తెలిపారు.