
గాజువాక ( జనస్వరం ) : గాజువాకలోని పలు వార్డుల నుంచి 40 మంది వివిధ మహిళాసంఘాల కార్యదర్శులుగా మరియు అధ్యక్షులుగా పనిచేసిన మహిళలు జనసేనపార్టీలోకి జాయిన్ అయ్యారు. గాజువాక నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు విందుల వెంకటరమణ గారి సారధ్యంలో శ్రీనగర్ యందు పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ మరియు PAC సభ్యులు కోన తాతారావు గారి సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. అనంతరం పార్టీ కండువాతో కోన తాతారావు గారు మహిళలందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని స్సోచించారు. జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆసాయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లెలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.