Logo
Date of Publish : 11 February 2024, 11:20 pm
Editor : Sake Naresh

మహిళా సాధికారత జనసేన టీడీపీ పార్టీలతోనే సాధ్యం

    అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 7వ డివిజన్ నీరుగంటి వీధిలో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన టీడీపీ పార్టీలకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని వారి ఆర్థిక ఎదుగుదలకు ఏమాత్రం కృషి చేయకుండా రాష్ట్ర స్థూల ఆదాయంలో మహిళల వాటా ఏమాత్రం లేకుండా చేసారని అన్నారు. దీనికి తోడు డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి వారి సాధికారతను దెబ్బతీసాడని జగనన్న పాలవెల్లువ వల్ల మహిళలకు ఓరిగింది ఏమి లేదని కనుక మహిళలంతా ఈ విశయాలన్ని గ్రహించాలని కోరారు. జనసేన టీడీపీ పార్టీలతోనే మహిళలకు సముచితమైన సాధికారత లభిస్తుందని వారి ఆర్థిక ఆత్మగౌరవం పెంపొందించేందుకు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటారని అన్నారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో పందుల స్వైర విహారం చేస్తున్నాయని, గడిచిన నేల నుంచి మంచినీరు ఏమాత్రం రావడం లేదని అయినప్పటికీ స్థానిక వైకాపా కార్పొరేటర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com