బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యావసర సరుకులు, కరెంటు చార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, భారీగా పెంచివేసి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకి భారంగా మారి దివ్యాంగులకు చాలీచాలని పెన్షన్ ఇస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ ఒకటో తారీఖున రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో మండలాల్లో దివ్యాంగులకు వృద్ధులకు పెన్షన్లు ఈ రోజుకు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న సంఘటన అందరికీ తెలిసినదే. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే దివ్యాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని, పెరిగిన కరెంట్ బిల్లు తగ్గించాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, దేవిరెడ్డి శ్రీనివాసరావు, గంట నాగమల్లేశ్వర రావు, షేక్ సుభాని వీర్రాజు, కుంట సూరయ్య తదితరులు పాల్గొన్నారు.