Search
Close this search box.
Search
Close this search box.

చంద్రయాన్-3, ఆదిత్యా ఎల్1 సక్సెస్ తో గగన్ యాన్ కు స్పీడ్ పెంచిన ఇస్రో

చంద్రయాన్-3

        అంతరిక్ష రంగ చరిత్రలో ఇటీవలి కాలంలో ‘చంద్రయాన్ -3’, ‘ఆదిత్య-ఎల్ 1′ మిషన్లు అపూర్వ విజయాన్ని సాధించిన తరువాత, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తన అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తూ..గగన్ యాన్-1 మిషన్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఖచ్చితమైన టూల్, కాంపోనెంట్ తయారీని సీటీటీసీ భువనేశ్వర్ దాదాపుగా పూర్తి చేసింది. “చంద్రయాన్ -3” కోసం, సీటీటీసీ భువనేశ్వర్ కూడా గణనీయమైన మొత్తంలో ఖచ్చితమైన పరికరాలు, విడి భాగాలను ఉత్పత్తి అందించింది.’గగన్ యాన్ -1’ కాంపోనెంట్ ను 120 మందికి పైగా ఇంజినీర్లు, టెక్నీషియన్ల బృందం తయారు చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

    ఇస్రో ఇప్పుడు తన తదుపరి అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కోసం పనిచేస్తోందనీ, పూర్తిస్థాయిలో సన్నద్ధమైన, రూపొందించిన భారత వ్యోమనౌకలో ఒక భారతీయుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన తొలి అంతరిక్ష యాత్ర ఇదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ స్పేస్ మిషన్ విజయవంతం కావడానికి అనేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబో – వ్యోమిత్ర ప్రమేయాన్ని ఇస్రో ధృవీకరించింది. భారత వ్యోమగాముల భద్రతను పరీక్షించి నిర్ధారించడానికి ఇస్రో సిబ్బంది ముందే ఈ రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు.

    ప్రస్తుత హెవీ వెయిట్ ఎల్వీఎం-3 లాంచ్ వెహికల్ భవిష్యత్తులో క్రూ మాడ్యూల్, భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ (హెచ్ఆర్ఎల్వీ)గా మారనుంది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ రాజరాజన్ ఇండియాటుడేకుతో మాట్లాడుతూ.. క్రూ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం, 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ఉంచడం హెచ్ఆర్ఎల్వీ ప్రాథమిక పాత్ర అని వివరించారు. ఎల్వీఎం3ని హెచ్ఆర్ఎల్వీగా పిలుస్తామనీ, ఎందుకంటే ఈ వాహనానికి హ్యూమన్ రేటింగ్ ఇస్తున్నామని తెలిపారు. అన్ని వ్యవస్థలు వైఫల్యం నుండి అత్యంత భద్రతతో అభివృద్ధి చేయబడతాయి.

      దీనితో పాటు, ఏ దశలోనైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే క్రూ ఎస్కేప్ సిస్టమ్ క్రూ మాడ్యూల్ ను సురక్షిత దూరం తీసుకెళ్లేలా చూడాల్సి ఉంటుంది” అని రాజరాజన్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో క్రూ మాడ్యూల్ సముద్రంలో కూలిపోయేలా రూపొందించారు. ప్రస్తుతం క్రూ మాడ్యూల్ డ్రాప్ టెస్ట్ లు, హై ఆల్టిట్యూడ్ డ్రాప్ టెస్ట్ లు, క్రూ ఎస్కేప్ సిస్టమ్ వ్యోమగాములను సురక్షిత దూరానికి తరలించే ప్యాడ్ ఎవైర్ టెస్టులతో సహా వివిధ పరీక్షలను ఇస్రో నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way