భీమవరం ( జనస్వరం) : భీమవరంలో విశ్వనాథుల అంజలి అనే విద్యార్థినికి ఐసెట్ లో 2 వేల లోపు మంచి ర్యాంకు వచ్చింది. డా. CSN డిగ్రీ & పీజీ కాలేజ్ లో MCA సీటు వచ్చింది. కానీ, అమ్మాయి OC క్యాటగిరీ అవడం వలన ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే అవకాశం లేదు. చదువులో టాపర్ అయినా, ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఇక్కడితో చదువు మానేయ్యాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ HOD లు శ్రీమతి ఉదయలక్ష్మి టేకి గ మరియు డా. సుధా గుండా గారు స్థానికంగా ఉన్న జనసైనికుడు మేడిశెట్టి రవి చంద్ర గారికి తెలియజేశారు. ఈయన వెంటనే తన స్నేహితులైన జనసైనికులకి తెలియజేసి అంజలి చదువుకి అయ్యే మొత్తాన్ని సేకరించారు. భీమవరం జనసేన ఇంచార్జ్ శ్రీ కొటికలపూడి గోవిందు ( చినబాబు ) గారి చేతుల మీదుగా అంజలికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. చినబాబు గారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తీసేయడం వలన చదుకోవాలనుకుంటున్న ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారని అన్నారు. “ ఆడపిల్ల చదువు అవనికే వెలుగు ” అన్న మాటలను గుర్తూ చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఫీజు రీయింబర్స్మెంట్ మీద మరొక సారి పరిశీలి౦చాలని కోరారు. స్థానిక జనసైనికుడు మేడిశెట్టి రవిచంద్ర గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉండే౦దుకు జనసేన పార్టీ ముందుందని అన్నారు. కుమారి అంజలి బాగా చదువుకొని సమాజానికి ఉపయోగపడేలా, ఇతరులకు ఆదర్శమయ్యేలా కష్టపడాలని కోరారు. ఈ బృహత్కార కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన బాలినీడీ శ్రీను, హిమకర్ కొండ, నిడదవోలు రాజా శ్రీకాంత్, గోవింద్, నాగబాబు, తోట స్వామి నాయుడు గార్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమ౦లో జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com