విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా పరిణితితో ఉన్నాయని.. గతంలో కంటే ఇప్పుడు ఆయన పూర్తి రాజకీయ అవగాహనతో మాట్లాడుతున్నారని.. ఇప్పుడంతా పెద్దలు, మేధావులు అంటున్న మాటని విజయనగరం జానసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) అన్నారు. ఆయన అంటుంది నిజమే.. ముందు పార్టీ సిద్ధాంతాలను ప్రజాల్లోకి తీసుకు వెళ్లేలా జన సైనికులు కృషి చేయాలే తప్ప తమ పార్టీ నేతలపై ఫిర్యాదులు కాదు అంటున్నారు. పొత్తుల విషయం నాలుగు గోడల మధ్య కాదు నలుగురికి తెలిసేలా మీడియా ముందుకు వచ్చి చెబుతాను అంటున్నారు. మన బలం ఏమిటో ముందు మనం బేరీజు వేసుకుని, ఆపై సీఎం సీటులో ఎవరా అనేది ఆలోచిద్దాం తప్పితే, తానే సీఎం లేదా చంద్రబాబు ను సీఎంను చేస్తానని అనుకోవద్దని జనసేన శ్రేణులకు సూటిగా చెబుతున్న వ్యాఖ్యల్లో పవన్ రాజకీయ పరిణితి కనిపిస్తోందన్నారు. ఇన్నాళ్లు పార్టీ అంతర్గతంగా జరిగిన పరిణామాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయని పవన్, ఇలా పార్టీని క్రమశిక్షణలో పెట్టే దిశగా అడుగులు వేయడం శుభపరిణామం. వచ్చే ఎన్నికల్లో పవన్ ను కింగ్ లా కాకుండా కింగ్ మేకర్ లా చూడమని, అలా చేయమని తన ఘాటైన వ్యాఖ్యలు ద్వారా జన సైనికులకు హెచ్చరించడం చూస్తే, పార్టీను గాడిన పెట్టే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. మరి జనసైనికులు, అభిమానులు, కొన్ని కులవర్గాలు ఆయన్ని మళ్లీ ముంచుతారో, పైకి తేలుస్తారో చూడాలని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com