విజయవాడ ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo 30వ రోజు కార్యక్రమం 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాయల్ హోటల్ వద్దనుండి ప్రారంభించి 53వ డివిజన్ లోని పలు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది. పోతిన మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో ఈరోజు 53వ డివిజన్లో లోని డ్రైన్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైన్ నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో చేపట్టడం లేదని, గతంలో ఆ డ్రైన్లో పడి ఒకరు చనిపోయారని, డ్రైన్ పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, స్థానిక కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గారు గాని ఆ పనులు వేగంగా పూర్తి చేయాలనే దృష్టి లేదని, స్థానిక ప్రజలు మాకు ఫిర్యాదు చేశారని, ఇంటింటికి వచ్చి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి గత మూడేళ్లుగా చెబుతున్నారని, ఇప్పటివరకు కనీసం మాకు హామీ పత్రం కూడా ఇవ్వలేదని, మేము డబ్బులు కట్టి ఇళ్ల పట్టాలు తీసుకోనీ ఎక్కడో దూర ప్రాంతాల్లో ఎందుకు ఉండాల ?అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయాయని, పన్నులు విపరీతంగా పెంచేశారని, వాటి గురించి మాట్లాడాలన్నా కూడా భయపడే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారని, 100% ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే ఆ పిలుపుకి మేము అందరం కూడా కట్టుబడి ఉంటామని, తెలియపరచి మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వెల్లంపల్లి శ్రీనివాస్ మీరు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు మీరు తిరగకపోయినా అదృష్టంతో ఎమ్మెల్యే అయిపోయావని, 2019 ఎన్నికల్లో మళ్ళా వేవ్ లోఅదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచారని, ఇంటింటికి తిరగడం అంటే రోజుకి ఒక బూత్ అవ్వడమే కష్టమని మీలా ఈదురు గాలులకి కొట్టుకొచ్చిన వాడికి కష్టం ఏమితెలుస్తుందని, పైరవీలుచేసేవారకి, గుళ్ళలో కాంట్రాక్టర్లు దగ్గర డబ్బులు కొట్టేసే వాడికి దేవాలయాలు దోచుకునే నీలాంటోడికి ఇంటింటికీ ప్రచారం అంటే ఏంతెలుస్తుంది మేము కష్టపడి కొండలెక్కి ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అదే విధంగా ఆ సమస్యలను నివృత్తి చేయడానికి స్పందనలోనో సిపి గారిని లేక కమిషనర్ గారిని కలవడం జరుగుతుందని మీరు చేయవలసిన పనులు మేము చేయావలస్సీ వస్తుందని కనీసం నువ్వు ఎక్కడైనా డ్రైనేజీలు పూడికలు తీయించడం గాని దోమల మందులు చల్లించడం గాని ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసావా కరెంటు స్తంభాలు వేయించడం గాని, నేల బోర్లు తవ్వించడం కానీ ఎక్కడ అన్న చేశావా కనీసం ప్రజా సమస్యల గురించి వారితో ఎప్పుడైనా మాట్లాడావా ఇవి ఏమీ కూడా నువ్వు చేయకుండా నీకు ప్రజా సమస్యల గురించి ఏం తెలుస్తుంది అని ఎక్కడో సుడిగాల్లో కొట్టుకొచ్చి ఎమ్మెల్యే అయిన మీరు గాలి మాటలు మాట్లాడితే ఉపేక్షించేది లేదని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గత కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు ఇక్కడ ఓట్లు రాలేదని మాట్లాడుతున్నాడని గత కార్పొరేషన్ ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా గట్టి పోటీ ఇచ్చారని మా జనసేన అభ్యర్థులుకు సరైన అవగాహన లేక మివారు గెలిచారని, లేకపోతే మా అభ్యర్థుల చేతులో చావు దెబ్బతినెవారని, మా అభ్యర్థుల గురించి మా నాయకుల గురించి తక్కువ చేసి మాట్లాడితే నీలాంటి ఎదవన్నర ఎదవలకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు అని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వారాహి వాహన పూజా కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారని ఆరోజే నీ ఓటమి ఖరారు అయిందని వారాహి వాహన నట్లు బిగించడానికి కూడా పనికిరాని నువ్వు వారాహి వాహనంపై విమర్శలు చేస్తే మేము ఊరికినేది లేదని ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు కూడా నిర్ణయించుకున్నారని పశ్చిమ నియోజకవర్గంలో నీ ఓటమి తప్పదని ఇక్కడ జనసేన పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఇక్కడ పోతిన మహేష్ అత్యంత భారీ మెజారిటీతో గెలుస్తాడని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది.
మల్లేపు విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 53 డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగిందనీ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నారని అదేవిధంగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసేది ఏమనగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారికి తెలియజేస్తుంది ఏమంటే మీరు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నాలుక చీరుస్తానని అదే విధంగా మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండి కాపులకి ఒక్క పథకం అయినా ఇప్పించ గలిగారా అదే విధంగా కాపు కార్పొరేషన్ కి నుండి ఒక్క రూపాయి అయినా కాపులకి వేయించ గలిగారా నీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలని అదేవిధంగా విదేశీ విద్య పథకం గాని పెళ్లి కానుక గాని రుణాల గాని అదేవిధంగా కాపుల అభివృద్ధి గురించి మీరు ఏమైయినా చేయగలిగారా మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఉండి కాపులు కోసం ఏమి చేశారో సమాధానం చెప్పాలని మీరు ఖాళీ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉండి మీకు చేతకాక మీకు జగన్ మోహన్ రెడ్డి గారు మెడలో కాపు కార్పొరేషన్ అని ఒక ట్యాగ్ వేశారని మీరు ఖాళీ అని మీ వల్ల ఏ ఉపయోగం లేదని అది మీరు గమనించాలని ఇవేమీ చూసుకోకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే కాపు మహిళల చేత చెప్పు దెబ్బలు తింటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగిందని మరి ఈ ఐదు సంవత్సరాల గాని పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని వాటి గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయగలిగారా అని కాపుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ విషయం ప్రతి ఒక్క కాపు సామాజిక వర్గానికి తెలుసని మీరు కాపులు ఏదో ఉద్ధరిచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారినీ విమర్శిస్తే ఊరుకునేది లేదని కాపుల్ని మోసం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని అటువంటి వారిని వెనకేసుకొచ్చిన మీరు కాపుల ద్రోహి అని మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలితే కాపు మహిళల చేత చెప్పులు దెబ్బలు తింటారని అదేవిధంగా మా కాపు మహిళల పూర్తి మద్దతు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకేనని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రేఖపల్లి శ్రీను, పిల్లా శ్రీకాంత్, నాగూర్, మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు కోరగంజి వెంకటరమణ, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూషా, , సిగానంశెట్టి రాము , ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్, షేక్ అమిర్ భాష, తమ్మిన.లీలాకరుణాకర్ ,అడ్డూరి తమ్మారావు, బొమ్ము. రాంబాబు నల్లబిల్లి కానకారావు, వేంపల్లి గౌరీ శంకర్ సబిన్కర్ నరేష్, పొలిచేరి రమేష్,బొట్టా సాయి,పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు