అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటమంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 17వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గలోని స్థానిక 30వ డివిజన్ అరవింద్ నగర్ మిస్సమ్మ కాలనీలలో పర్యటించి ఇక్కడ స్థానిక ప్రజలనుంచి పలు సమస్యలను తెలుసుకొని ఈ విధంగా మాట్లాడారు.. ఈ కాలనీలో ఏ మహిళను అడిగిన ఏ ఇంటికి వెళ్ళినా వారు చెప్పే మాట ఒకటే అని గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము అయినప్పటికీ మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని రాజకీయ నాయకుల వత్తిల్లతో ఇక్కడ భయం భయంగా బ్రతుకుతున్నామని అంటున్నారని అన్నారు. ఇక్కడ దాదాపు 870కుటుంబాలు నివాసం ఉంటున్నారని వీరికి ఇళ్ల పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం వీరిని పట్టించుకోక తీవ్ర మౌలిక సదుపాయాల కొరతతో బాధపడుతున్నారని అన్నారు. రోడ్లు, మురుగుకాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వీరి సమస్యల పరిష్కారానికి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపన అనంతరం కచ్చితంగా చర్యలు తీసుకోని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యేలా చేసి రాజకీయ కభంద హస్తాల చెరనుంచి మిస్సమ్మ కాలనీని రక్షిస్తామని అన్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు శ్రీదేవి నాగేంద్రమ్మ గంగారత్నమ్మ 30వ డివిజన్ ఇంచార్జ్ రాజేష్ నాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది.