గుంతకల్ ( జనస్వరం ) : గుంతకల్ పట్టణం నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం, పత్తికొండ పరిసర ప్రాంతాలకు భారీ వాహనాలు వెళ్లాలంటే స్మశాన వాటిక, వాల్మీకి నగర్, పురాతన శివాలయానికి వెళ్లాల్సినటువంటి రైల్వే మోరి కింద ఉన్న ప్రధాన రహదారి ముఖ్యం. ఆ దారి మురికి కూపంగా మారి, మురుగునీరు సరిగా వెళ్లే మార్గం లేక అక్కడ నిలబడిన మురుగునీరు వల్ల నిత్యం వందలాదిమంది ప్రజలు అస్తవ్యస్తలు పడుతున్నారని జనసేన నాయకులు అన్నారు. మురుగునీరులో పడి గాయాల బారిన పడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని, అంతేకాకుండా అటు వైపు వెళ్లే రహదారిలో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేకపోవడం వల్ల రాత్రిపూట ఆ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా చేయడానికి తావిస్తోందని అన్నారు. గతంలో కూడా ఈ సమస్య గురించి అనేకసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అప్పటికప్పుడు తూతూ మంత్రంగా తాత్కాలికంగా శుభ్రం చేయడం తప్ప. శాశ్వత పరిష్కారం చేయడం లేదన్నారు. కావున కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ అయినా తక్షణం వీధి దీపాలు మరియు పరిశుద్ధ సమస్యను తీర్చండి మహాప్రభో ప్రజల పక్షాన వాసగిరి మణికంఠ నిలదీశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యను పరిష్కరించని పక్షాన జనసేన పార్టీనే చొరవ తీసుకొని శ్రమదానానికి పూనుకొని నిరసన వ్యక్తం చేస్తామని గట్టిగా హెచ్చరించారు… ఈ మురుగు నీరు వెళ్లే మార్గాన్ని పెద్ద ఎత్తున కాలనీవాసులు, జనసేన నాయకులు, జన సైనికులు సందర్శించి ఆ దీనస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు…