ఒంగోలు, (జనస్వరం) : సంక్రాంతి సంబరాలులో భాగంగా ఒంగోలు ఫస్ట్ డివిజన్ లో ఈ నెల 12వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన ముగ్గుల పోటీలు మంత్రి అనుచరుల ఒత్తిడి మూలంగా రద్దు చెయ్యటం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనాగరిక ఆంక్షలు ఏంటీ? కేవలం ముగ్గుల పోటీకే బయపడి కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఫోన్ లు చేసి పోలీస్ లతో కొట్టిస్తాం, కేసులు పెట్టిస్తాం అని బెదిరించటం ఏంటీ? మనం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో వున్నామా? లేక ఒంగోలు లో ఏదైనా వైసీపీ ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుందా! అని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ అన్నారు. వైసీపీ పార్టీ మరియు నాయకులు ప్రజాధారణ వున్నా వాళ్ళమీ అందుకే గెలిచాము అని చెప్పుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు జనసేన పార్టీ నిర్వహించే ముగ్గుల పోటీకే ఎందుకు భయపడుతున్నారు. ఈ రాష్ట్రం లో ప్రజలకి స్వేచ్ఛ లేదా? మీరు నిజంగా సుపరిపాలన చేస్తుంటే ఎందుకు జనసేనపార్టీని చూసి భయపడుతున్నారు. మీకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు తొందర్లో వస్తుంది సిద్ధం గా వుండండి అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com