తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 16 (జనస్వరం) : స్వయం ఉపాధితో తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటో డ్రైవర్లకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద మంగళవారం తాడేపల్లిగూడెంకు చెందిన 400 మంది ఆటో డ్రైవర్లు బొలిశెట్టి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక డ్రైవర్ కొడుకు నేనని తనకు మోటర్ ఫీల్డ్ లో ఉన్న కష్టాలు తెలుసు అని పేర్కొన్నారు. అధికారంలోకి రాబోయేది కోటమేనని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను తోడుగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణం, పెంటపాడు తాడేపల్లిగూడెం మండలాల యూనియన్ల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com