తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 11 (జనస్వరం) : మైనార్టీలైన ముస్లింలకు తాను అండగా ఉంటానని జనసేన నియోజవర్గ ఇంచార్జ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా తాడేపల్లిగూడెం నుంచి ముస్లిం యువకులు బొలిశెట్టి నివాసానికి వచ్చి గురువారం ఆయనకు రంజాన్ కిర్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లిం యువతకు రంజన్ శుభాకాంక్షలు వారి కుటుంబాలలో ఆ భగవంతుడు అల్లా దీవెనలు సుఖ సంతోషాలు విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముస్లింలలో అధికంగా మోటార్ ఫీల్డ్ లో చిన్న చిన్న చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారని వారందరికీ జగన్ ప్రభుత్వంలో ఉపాధి కరువైందన్నారు. దీంతో వారంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని ముస్లిం యువత యువకులు వారు కూడా విద్య వైపు ముగ్గు చూపి ఉన్నత చదువులు చదువుకోవాలని ప్రభుత్వ ఉద్యోగాలకి వెళ్లాలని సాఫ్ట్వేర్ రంగానికి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను వారికి తమ ప్రభుత్వం రాగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం యువకులు బొలిశెట్టికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.