విజయనగరం ( జనస్వరం ) : అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీల ఓట్లకోసం, నమ్మించి.. అధికారం చేజిక్కించుకొని, మా బలహీన వర్గాలకు చెందిన ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలను తీసివేసి, ఆఖరకు అంబేత్కర్ పేరు మీదఉన్న పథకాన్ని తీసి మీరేదో అంబేత్కర్ కన్నా గొప్పలా మీ పెరుపెట్టుకున్న ఘనత మీదికాదా అని అడుగుతున్నామని జనసేనపార్టీ నాయకులు ఆదాడమోహనరావు ద్వజమెత్తారు. సోమవారం ఉదయం కలక్ట్రేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి కి బాదంగి మండలం, వీర సాగగరం గ్రామస్థులకు దాదాపు ముప్పై ఎస్టీ కొండదొరకు చెందిన కుటుంబాలకు, మూడుసంవత్సరాలు పదిహేడు చెరువులను బ్రతడానికి చేపల పెంపకంనకు ఇవ్వగా.. గడువుతీరకముందే, ఆ చెరువులకు అక్కడున్న స్ధానిక వైఎస్ఆర్సపీ నాయకులు, సర్పంచ్, ఎం.పి.పి., పంచాయితీ సెక్రటరీలు ఆ చెరువులకు మళ్ళీ వెలంపాటవేసి వీళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారని, వీరికి మళ్ళీ ఆ చెరువులను చేపల పెంపకానికి ఇచ్చి న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కొండదొరలకు న్యాయం జరిగేవరకు జనసేన తరుపున పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వీరసాగరం కు చెందిన భదిత కుటుంబాలు హాజరయ్యారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com