Search
Close this search box.
Search
Close this search box.

సుగాలీ ప్రీతి కి న్యాయం జరిగేనా? ప్రభుత్వాలు స్పందించేనా ??

సుగాలీ ప్రీతి కి న్యాయం జరిగేనా? ప్రభుత్వాలు స్పందించేనా ??

    కామాంధుల చేతిలో బలయ్యి, కానరాని లోకాలకి వెళ్ళిపోయినా ఆ ఆడబిడ్డకు న్యాయం జరిగేనా? ప్రభుత్వాలు స్పందించేనా ?? 

           మనం రోజూ వార్తల మీద అత్యాచారాలు జరగడం టీవీలో చూస్తూనో, పేపర్లో చదువుతూనో ఉంటాం. ఇలాంటి సందర్భాలు మన ఇంట్లో వరకూ వస్తే గానీ, తెలియదు అది ఎంత పెద్ద గాయమో… కర్నూలులో ఒక రెసిడెన్సీయల్ స్కూల్ లో 14 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఆకస్మికంగా మరణిస్తే ఆ తల్లిదండ్రులకు బాధ ఎలా వుంటుందో చెప్పలేను. కానీ, తమ కూతురిని మానభంగం చేసి చంపారని తెలిస్తే ఆ తల్లిదండ్రులు తట్టుకోగలరా? అటువంటి బాధను తట్టుకొని న్యాయం కోసం పోరాడుతున్నా ఆ తల్లికి మన వంతు పోరాటాన్ని అందియ్యలేమా? నాతో పాటు నువ్వు కూడా రా, ఈ సమస్యను మన ఇంట్లో సమస్య, ఆ చనిపోయిన ఆడబిడ్డ మన ఆడబిడ్డ అనుకుందాం . ఆ నిందితులకు శిక్ష్య పడేలా ఓ అన్నలా ప్రభుత్వాన్ని నిలదీద్దా౦. 

            కర్నూలు నగర శివారులోని లక్ష్మి గార్డెన్ లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దేవిల కుమార్తె సుగాలీ ప్రీతి. అపుడు 14 సంవత్సరాల వయసులో 10 వ తరగతి చదువుతూ క్రమశిక్షణ గల అమ్మాయి. కలెక్టర్ కావాలన్న సంకల్పంతో ఎపుడూ చదువు మీదే ధ్యాస ఉండేది. తెలుగు దేశం పార్టీకి చెందిన దిన్నెదేవరపాడు వద్ద ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్సీయల్ స్కూలులో చదివేది. 2017 సంవత్సరం ఆగష్టు 19 న ఆ స్కూలులో ఒక అమ్మాయి మృతుదేహన్ని చూసిన తోటి విద్యార్థులు భయబ్రాంతులకు గురి అయ్యారు. తీరా చూస్తే ఆ శవం తమ తోటి విద్యార్థి అయిన సుగాలీ ప్రీతిది అని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ సంఘటనను చూసి పోలీసులు ఆత్మహత్య అని తేల్చారు. నిజానికి అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే అది ఆత్మహత్య కాదు హత్య అని ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ, పోలీసులు అలా చెప్పడానికి వారి వెనుక ఏవైనా రాజకీయ శక్తులు ఆపి ఉండొచ్చు. అక్కడి పరిస్థితులను చూసిన ఆ ప్రీతి తల్లిదండ్రులకు అది ఆత్మహత్య అని నమ్మకం కలగలేదు. హత్య చేశారు అని ఆరోపించారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అంత మానసిక పరిస్థితి లేదని వారించారు. లోతుగా విశ్లేషణ చేయగా వారికి తెలిసిన నిజాలు ఏంటంటే ఆ స్కూల్ యాజమాన్య కుమారులే రేప్ చేసి చంపేశారని. ఆ తల్లిదండ్రులకు అ ఘటనకు రెండు రోజుల ముందు స్కూల్ యాజమాన్యం నుంచి కాల్ చేసి మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు సృహ తప్పి పడిపోయింది అని చెప్పారట. వెంటనే తన కూతురికి కాల్ చేసి మాట్లాడగా ఇక్కడ స్కూల్ యాజమాన్యం నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు నన్ను ఇంటికి తీసుకెళ్లండని వేడుకోందట. తీరా రెండు రోజుల తరువాత ఇలా ఆత్మహత్య చేసుకుంది అంటే నమ్మశక్యంగా లేదు.

                   ప్రీతి తల్లిదండులకు ఎన్నో అనుమానాలు కలిగాయి. అందులో ముఖ్యంగా ప్రమాదం ఘటన జరిగిన రోజున ఆమె దేహంపై గాయాలు ఉండడం, మెడపై తాడుతో బిగించినట్లుగా గుర్తులు ఉండడం, ఆమె జననాంగాలపై తీవ్రమైన గాయాలు ఉండడం, 52 కిలోలు ఉన్న అమ్మాయి ఒక ఫ్యాను రెక్కకు ఉరి వేసుకోవడం ఎలా సాధ్యం? ఉరి వేసుకుంటే సాధారణంగా కాళ్ళు గాల్లో ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం నేల మీద ఉండడం ఆశ్చర్యంగా ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం గర్భసంచిలో వీర్యం నిండి ఉందని, దాదాపుగా చాలా ఎక్కువ సార్లు ఒకే రోజులో మానభంగం చేసి ఉండవచ్చని తెలిపారు. ఫెథాలజీ డాక్టర్ బాలేశ్వరి గారు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రీతి తల్లిదండ్రులు SC ST చట్టం కింద పోలీసు ఫిర్యాదు చేయగా మళ్ళీ పోస్టుమార్టం చేశారు. ఈసారి అనంతపురం నుంచి ఇద్దరు వైద్యులను పిలిచి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఇక్కడ విశేషం ఏంటంటే మృతదేహాన్ని తాకకుండా పోస్టుమార్టం చేసి, అత్యాచారానికి గురి అవ్వలేదని తప్పుడు నివేదిక అందించారు. ఇన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నా పోలీసువారు మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించి రాజకీయ నాయకులకు, స్కూలు యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారు. ఈ విషయాలను మనం నిశితంగా గమనించినట్లయితే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని బలంగా చెప్పగల౦. ఈ కేసును పక్కదోవ పట్టించడానికి పోలీసులు సహకరించడం, అప్పటి, నేటి రాజకీయ అండదండలు ఉండడం మన దురదృష్టకరం. 

                 అప్పటి కలెక్టర్ గారు కూడా  ఐదుగురు సభ్యులతో కమీటీ వేయగా, ఆ కమీటీ కూడా అత్యాచారానికి గురయ్యి, హత్య చేశారని నివేదిక ఇవ్వడం జరిగింది. అయినప్పటికి ఆ నిందితులను అరెస్ట్ చేసినా వెంటనే వదిలేశారు. అప్పటి, ఇప్పటి ప్రభుత్వాలు ఆ యాజమాన్యానికి కొమ్ము కాశాయి అని స్పష్టంగా అర్థం అయింది. ఈ సమస్యకు పరిష్కారం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే న్యాయం చేయగలని భావించి అక్టోబర్ 2019 కలసి మొత్తం వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. మొత్తం విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరిలో 2020 లో కర్నూలులో లక్షలాది మంది జనసైనికులతో సుగాలీ ప్రీతికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసును వెంటనే సీబీఐ కు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కర్నూల్ పర్యటన వచ్చినపుడు ఈ కేసును సీబీఐ కు అప్పగిస్తున్నామని జీవో కూడా ఇచ్చారు. ప్రభుత్వం అయితే జీవో ఇచ్చింది కానీ, ఆ కేసును సీబీఐ కు ఆపగించలేదని సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే ఇపుడు ఒక మహిళా జర్నలిస్టు అయిన శ్వేతారెడ్డి కట్టమంచి రామలింగా రెడ్డి యాజమాన్యం దగ్గర కోటి రూపాయలు  ఇస్తే కేసు వెనక్కి తీసుకుంటాను అని అడిగారంటా కదా అంటూ  సోషల్ మీడియా వేదికగా తప్పుడు భావాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయమై ప్రీతి తల్లిదండ్రులు జర్నలిస్టు శ్వేతా రెడ్డి మీద కేసు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రాజకీయ అండదండలు ఉన్నంత కాలం ఈ కేసు ముందుకు సాగదు. మనమే ఒక స్వరమై, గళమై మన చెల్లెలి సుగాలీ ప్రీతి కోసం పోరాడుదాం. 

By

హిమకర్ 

ట్విట్టర్ ఐడి : @Himakarkonda3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way