శ్రీశైలం ముంపు బాధితులకు అండగా నిలబడితే అరెస్టులు చేస్తారా : ఎమ్మిగనూరు జనసేనపార్టీ నాయకులు

               శ్రీశైలంలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని శాంతియుతంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న  జనసేన పార్టీ నాయకులు పవన్ కుమార్, మైనారిటీ నాయకులు ఆర్షద్ లను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని న్యాయం కోరితే ఆరెస్టులు చేస్తారా అని జనసేనపార్టీ గోనెగండ్ల మండల సమన్వయకర్త ఖాసీం సాహెబ్, సుబాన్ తెలిపారు, ఈ సంధర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా శ్రీశైలంలొ భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు జీవోనెం 98 ప్రకారం ఆదుకుంటామని ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఏళ్ళు గడుస్తున్నా న్యాయం జరగడం లేదని ప్రశ్నిస్తే అరెస్టులు అక్రమాకేసులు బనాయించడం దారుణమన్నారు. దలిత నాయకులపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేఖంగా భూనిర్వాసితులకు అండగా నిలబడిన జనసేనపార్టీ నాయకులను సైతం అరెస్టులు చేసి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సంకెళ్లతో సమాధానం ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భూనిర్వాసితులు దాదాపు 674 మంది బాధితులు ఎన్నో ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగితే కేవలం 12 మందికి మాత్రమే జలమండలిలో ఉద్యోగాలు కల్పించి చేతులు దులుపుకొవడం భావ్యం కాదన్నారు. భూనిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way