
విజయవాడ, (జనస్వరం) : విజయవాడకి NTR జిల్లా పేరు పెట్టినపుడు.. కడపకి YSR జిల్లా పేరు పెట్టినపుడు.. కర్నూలుకి దామోదరం సంజీవయ్య(దళిత ముఖ్యమంత్రి) గారి పేరు ఎందుకు పెట్టలేదు.? అని జనసేన నాయకులు దోమకొండ అశోక్ అన్నారు. కొత్త జిల్లాల పై YSRCP ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదన వెనక్కి తీసుకుని, కర్నూలు జిల్లాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు నామకరణం చెయ్యాలి. దళితులను అడ్డంపెట్టుకుని నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన YSRCP ప్రభుత్వం, మాజీ దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారినే విస్మరించింది. అలాంటిది సామాన్య దళితులకు ఏ విధంగా న్యాయం చేస్తుంది. దళితులందరూ ఆలోచించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కర్నూలు జిల్లాకి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన విధంగా శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని YSRCP ప్రభుత్వాన్ని జనసేన పార్టీ దళిత నాయకులు శ్రీ దోమకొండ అశోక్ డిమాండ్ చేసారు.