Search
Close this search box.
Search
Close this search box.

గాలి షాహిద్ దర్గాపై అంత కక్ష ఎందుకో ?

– వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల కోసం, దర్గా ఆస్తులను కబ్జా చేయడం కోసం కొత్త కమిటీ అని నాటకాలు ఆడుతూ తెరమీదకి తెస్తున్నారు.

– పశ్చిమంలో ఒక్క దర్గాకైనా కమిటీ వేశారా?

– జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్

        విజయవాడ, (జనస్వరం) : గాలి షాహిద్ దర్గా పై అంత కక్ష ఎందుకు అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ అన్నారు. ఈ సందర్బంగా పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు ముస్లింలకు మంచి కాదు మోసం చేస్తున్నారని, గాలి షాహిద్ దర్గా పై అంత కక్ష ఎందుకో ? సమాధానం చెప్పాలని, పేద ముజావర్లకు చెందిన భూములను వెల్లంపల్లి శ్రీనివాస్ మిత్రుల చెరలో ఉన్న మాట ముమ్మాటికీ నిజంమని, దమ్ముంటే వారి చెరలో నుంచి కబ్జా అయిన భూములను విడిపించాలని, వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల కోసంమే దర్గా ఆస్తులను కబ్జా చేయడం కోసం కొత్త కమిటీ అని నాటకాలు ఆడుతూ తెరమీదకి తెస్తున్నారని, పరస్పర అంగీకారంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు,వక్ఫ్ యాక్ట్ ను అనుసరించి గాలి షాహిబ్ దర్గాకు డైరెక్ట్ మేనేజ్మెంట్ కింద రెండు సంవత్సరాల కాల పరిమితితో అనుమతిని మంజూరు చేస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చిన ఇబ్బంది ఏమిటో సమాధానం చెప్పాలని, ఎవరికి ఏ భూమి లీజుకి ఇవ్వాలన్నా అది కేవలం వక్ఫ్ బోర్డు అనుమతితోనే ఇవ్వాల్సి ఉంటుందని, దాన్నుంచి తప్పించి కాజేసే కుట్రలో భాగంగానే వెల్లంపల్లి కుతంత్రాలు రచిస్తున్నారని, గతంలో వక్ఫ్ కు 7 శాతం ఆదాయంలో భాగంగా చెల్లించేవాళ్లు కానీ నేడు పరస్పర అంగీకారంతో 20 శాతం వక్ఫ్ బోర్డుకు 80 శాతం దర్గాకు చెందినగా అంగీకారం కుదిరిందని, ఏ లీజైన డైరెక్ట్ మేనేజ్మెంట్లో వక్ఫ్ బోర్డ్ అనుమతి లేకుండా ఇవ్వలేరని, దీనివల్ల స్థానిక ఎమ్మెల్యే కి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని, కాజా కోసం ఇంత డ్రామాని, కాజాకు వెల్లంపల్లి శ్రీనివాస్ కు మధ్య ఉన్న క్విడ్స్ ప్రోకో ఒప్పందం ఏమిటో ? చెప్పాలని, గతంలో వెల్లంపల్లి కుటుంబ సభ్యులకి కారు, వాచి కొనిచ్చారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, వెల్లంపల్లి ఊసరవెల్లి లాంటోడని, ముసలి పులి బంగారు కడియం లాగా చూపించి మోసం చేస్తాడని, కాజా వెల్లంపల్లి వలలో పడొద్దని, పేద 400 ముజావర్ల కుటుంబాలకు చెందాల్సిన డబ్బులు కాజేసేందుకే శ్రీనివాస్ కుట్రలు పన్నుతు వివాదాల సృష్టిస్తున్నాడని, ఏ రాజకీయ పార్టీ ఏనాడు గాలి షాహిబ్ దర్గా విషయాలలో జోక్యం చేసుకోలేదని, జలీల్ ఖాన్ గతంలో బలవంతంగా దర్గా జోలికి వెళ్లినందుకు ఆయనకే ఏ గతి పట్టిందో నేడు వెల్లంపల్లి కి అదే గతి పట్టి తీరుతుందని, గాలి సాహిబ్ దర్గా కి చెందిన భూములు విజయవాడ నగరంలోని చాలామంది రాజకీయ పెద్దల చేతిలో ఉన్నాయని, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏనాడు ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడలేదని, షాది ఖానా విషయంలో కానీ, అస్లాం హత్య కేసు విషయంలో కానీ వైఎస్ఆర్సిపి నాయకులైన చాంద్ భాషా కుమార్తె అత్యాచార విషయంలో కానీ స్పందించలేదని ముస్లింలు మైనారిటీలు అంటే వెల్లంపల్లి కి ఎప్పుడు చిన్న చూపేనని పశ్చిమ నియోజకవర్గoలో ముస్లింలకి చెందిన ఏ ఒక్క దర్గాకు కమిటీ నేటికీ వేయలేదని మూసాఫిర్ ఖానా, ఇందాద్ ఘర్,షా ఖాదరి హుస్సేనీ దర్గా, జిల్లా వక్ఫ్ బోర్డ్ లకు నేటికీ కమిటీలు వేయలేదని గాలిబ్ షాహీద్ దర్గా జోలికి వస్తే ఊరుకోమని తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు, సిగ్నం శెట్టి రాము గుప్తా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way