నెల్లిమర్ల ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి ఈ వై.సీ.పీ ప్రభుత్వం హయాంలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి నోచుకోలేదు. యువత అంతా నిరుద్యోగంతో వలసలు వెళ్ళిపోతున్న పరిస్థితి అలాగే తరక రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ మొదలు కాకపోవడమే కాక నిర్వాసితులకు పరిహారం కూడా అందించలేదు. అలాగే కనీసం గ్రామాలలో పారిశుధ్యం కూడా సరిగా లేక ప్రజలూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి ఎన్నో సమస్యల మీద ప్రజలకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు లోకం ప్రసాద్ గారు ముందుండి నడిపించారు. వారితో పాటు నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో గల జనసేన పార్టీ పూసపాటిరేగ మండల అధ్యక్షుడు జలపారు శివ, భోగాపురం మండల అధ్యక్షుడు వందనాల రమణ. నియోజకవర్గం సీనియర్ నాయకులైన గుడివాడ జమ్మారాజు, గుడివాడ శేఖర్, పల్లా రాంబాబు, పల్లంట్ల జగదీష్, పవన్, శేఖర్, సతీష్, రాజారావు, ప్రకాష్, పిన్నింటి ప్రమోద్ , పతివాడ శ్రీనివాస్, కరుమజ్జి గోవింద్, రామచంద్ర, హైమ, బాసి దుర్గ, కారి అప్పలరాజు, పైల శంకర్, శివ, కోరాడ అప్పారావు మరియు ఇతర జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని పూసపాటిరేగ మండలంలోని గల గొల్లపేట గ్రామం నుండి పూసపాటిరేగ MPDO ఆఫీసు వరకు సుమారు 1000 మందితో శాంతియుతంగా అవగాహన ర్యాలీ చేయటం జరిగింది. జనసేన చేస్తున్న ఈ శాంతియుత ర్యాలీకి మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కంది చంద్రశేఖరావు, మహంతి చిన్నంనాయుడు, మహంతి శంకరరావు, తాడి సత్య నారాయణ, మురిపాల భోగేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీ గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, యువత హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com