Logo
Date of Publish : 04 January 2023, 3:50 pm
Editor : Sake Naresh

ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదు?

- రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- జనసేనపార్టీ నాయకులు దోమకొండ అశోక్ డిమాండ్
      విజయవాడ, (జనస్వరం) : ఈ నెల 12న జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి భారీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను బుధవారం జనసేన నాయకులు దోమకొండ అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వం ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎన్ని జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసారో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలానో దిక్కులేదు కనీసం పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేటు ఉద్యోగాలైనా ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయి అంటే అది వైసీపీని నమ్ముకున్న సలహాదారులకే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్నారని, డిగ్రీలు పీజీలు చేసిన విద్యార్థులకు 5000 రూపాయలు వచ్చే వాలంటీర్ ఇస్తున్నారని, యువత అభివృద్ధి చెందాలంటే జనసేనపార్టీ అధికారంలోకి రావాలని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మాత్రమే యువతని అభివృద్ధి మార్గంలో నడిపిస్తారని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com