కడప ( జనస్వరం ) : నిత్యావసర వస్తువులు ఆకాశం అంటుంటుంతే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదని చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహ పత్రికాముఖంగా మాట్లాడారు. ప్రజలకు సినిమా టికెట్ల అవసరమా? లేక నిత్యావసర వస్తువులు ముఖ్యమా ? అని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కక్షతోనే సినిమా టికెట్లు తగ్గించారని అన్నారు. టిడ్కో హౌసింగ్ లోన్ పన్నులు.. హౌసింగ్ లోన్ తీసుకున్న వారు 10వేలు, 20వేలు, 40వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పేద ప్రజలను వంచిస్తూ వారిని భయాందోళనలకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసే పద్ధతి మంచిది కాదన్నారు. ఇది చాలా నీచమైన పాలనకు ధోరణి అని అన్నారు. 1980 మొదలుకొని 2009 సం. వరకు ఇచ్చినటువంటి హౌసింగ్ లోన్ ఏదైతే ఉన్నాయో వాటిపైన జగన్ పాదయాత్రలో ఏం చెప్పారంటే డబ్బులు కూడా తీసుకోకుండా అన్ని రుణమాఫీ చేసేస్తాం.. అందరికీ బి.ఫారం పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించేస్తాం. అందరికీ ఫ్రీగా ఇస్తాము జగన్ రెడ్డి ఈరోజున 10 వేల రూపాయలు, మున్సిపల్ పై 20వేల రూపాయలు, కార్పొరేషన్ పై 40 వేల రూపాయలు సెటిల్మెంట్ చేస్తున్నారు. బలవంతంగా సచివాలయం వాలంటరీ వ్యవస్థ వెళ్లి వారిపై భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని ఉచితంగా బి.ఫారం ఇల్లు వాటికీ రిజిస్ట్రేషన్ చేయించే విధానాన్ని అవలంబించాలని అన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పీడించే విధంగా డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదే విధంగా 2017,18 లో టిడ్కో ఇల్ల లు హౌసింగ్ నిర్మాణం మూడు కేటగిరిలో డబ్బులు ప్రజల నుంచి వసూలు చేయడం జరిగింది. వారి డబ్బు కమీషనర్ పేరు మీద డిడి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బును తక్షణమే వెనక్కి ఇవ్వాలి. దాదాపు 4 సంవత్సరాలుగా డబ్బులు కట్టిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు ఈ పద్ధతిని ఇలాగే చేస్తా ఉంటే బాధితులందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.