శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టాం మండలం, నడుకూరులో 12ఏళ్ల బాలికపై వాలంటీర్ చేసిన లైంగిక దాడి గురించి తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. యశస్వి గారు మాట్లాడుతూ 12ఏళ్ల బాలికపై వాలంటీర్ చేసిన లైంగిక దాడి చిత్తకార్తి కుక్క కంటే హీనమని మండిపడ్డారు. వైస్సార్సీపీ ప్రజల దేవాలయంలా భావించే సచివాలయంలోనే ఆడబిడ్డను చెడబరిచిన ఘటనకు నిరసనగా వాలంటీర్ వ్యవస్థ డౌన్ డౌన్ అంటూ జనసేన నాయకులతో కలిసి కొవ్వుతులతో నిరసన తెలిపడం జరిగింది. ఆడబిడ్డలకు మానంకన్నా ప్రాణం గొప్పది కాదని, తక్షణమే ఈ ఆడబిడ్డకు కోటిరూపాయల రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటినుండి మొత్తం చదువుతోపాటు భవిష్యత్ లో ఉద్యోగం కల్పించాలని శ్రీమతి పాలవలస యశస్వి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com