
నూజివీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని నూజివీడు వలసపల్లి రహదారి రమణక్కపేట శివారు కండ్రిక-దిగవల్లి రోడ్డు వద్ద గుంటలు ఏర్పడ్డాయి. బంక మట్టి కుప్పలతో పూడ్చడంతో రెండు రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు బురదతో రోడ్లు మొత్తం బురదమాయం కావడంతో నిన్న రాత్రి నూజివీడు నుండి వస్తున్న సమయంలో బైక్ టైర్ బురదలో జారడంతో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబుకి గాయాలయ్యాయి. దానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా సామాన్య ప్రయాణికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ పరిధిలో అధ్వాన్నమైన రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని నూజివీడు డివిజన్ సబ్ కలెక్టర్ గారిని కలిసి అయనకి పాశం నాగబాబు వినతిపత్రం అందజేశారు.