కర్నూలు జిల్లా, (జనస్వరం) : గోనెగండ్ల మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామానికి చెందిన హాజీరా పై హత్యాచారం జరిగి సంవత్సరం పూర్తి అయిన బాధిత కుటుంబానికి ఇంత వరకు న్యాయం జరగని దిశ చట్టం ఎందుకని మహిళ రాష్ట్ర సాధికారిక ఛైర్మెన్ రేఖాగౌడ్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్బంగా కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని, కోడుమూరు, పత్తికొండ, కర్నూలు జనసేనపార్టీ నాయకులతో కలిసి హాజీరా కుటుంబాన్ని పరామర్శించారు. ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ నాయకర్ మల్లప్ప గారు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం అనే సూత్రం హాజీరా కేసులో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. పేదలకు సరైన న్యాయం జరిగినపుడే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుందని తెలిపారు. ఇన్ని నెలలు కావస్తున్నా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి సమస్యను తీసుకెళ్తామని తెలిపారు. బాధితులు చేస్తున్న న్యాయ పోరాటంలో జనసేన పార్టీ న్యాయం జరిగేవరకు అండగా నిలుస్తుందని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అఘాయిత్యానికి పాల్పడిన వారికి వెంటనే కఠినంగా శిక్షలు పడేలా చట్టాలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కర్నూలు ఆర్షద్, పవన్ కుమార్, అరిగేళ్ల నాగేష్ పత్తికొండ, రాజశేఖర్, రేణు వర్మ కోడుమూరు, వెంకట్, చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, ఎమ్మిగనూరు మీడియా ఇంఛార్జ్ గానిగ బాషా, షబ్బీర్, గోనెగండ్ల మండల ప్రచార కార్యదర్శి రాహుల్ సాగర్, ఖాసీం సాహెబ్, షఫీ, మరియు తదితురులు పాల్గొన్నారు.