విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడ్డుపడుతున్నారో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని, సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించట్లేదని దీని మీద డిజిపి గారు స్పందించాలని కర్నూల్ లోని ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి గూండాలు ఇష్టానుసారం హల్చల్ చేస్తున్నారని, మీడియా మీద దాడులు చేస్తున్న శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఎందుకు డిజిపి గారు ఇవన్నీ నియంత్రించలేకపోతున్నారని, ఒక కేసులో అనేక ఆరోపణలు వుండి అనేక అనుమానాలు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ వ్యక్తికి ఈ రాష్ట్ర డిజిపి గారు అండగా నిలబడుతున్నారని, పోలీసులు దీనికి సమాధానం చెప్పాలని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు అవినాష్ రెడ్డిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని, అవినాష్ రెడ్డికి నిజంగా వివేకానంద రెడ్డి హత్యతో సంబంధం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకు హాజరవ్వటానికి భయపడుతున్నారని, నిజంగా మీకు ఈ హత్య కి సంబంధం లేకపోతే సిబిఐ అధికారులు ఎందుకు అరెస్ట్ చేస్తారని, దీనికి మీరు సమాధానం చెప్పాలని వివేకానంద రెడ్డి హత్య కేసు మీ కుటుంబం చుట్టూ తిరుగుతా ఉందంటేనే ఈ హత్యతో మీకు సంబంధం ఉందని తెలుస్తోంది అని, ఈ విషయం మీ సోదరి సునీత రెడ్డినే సూటిగా అనేకసార్లు తెలిపారని, ఈ హత్య తో అవినాష్ రెడ్డికి సంబంధం లేకుంటే ఆయన ఎందుకు పారిపోతున్నారని, అతనిని రక్షించే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని దీనికి మీరు సమాధానం చెప్పాలని, గతంలో బ్యాన్ లో ఉన్నటువంటి నార్కో ఎనాలసిస్ టెస్ట్ ని మళ్లీ ప్రత్యేకమైన అనుమతి తీసుకుని అవినాష్ రెడ్డి మీద నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేసి వాస్తవాలు బయటకు తీసుకురావాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని, మీడియా మీద పదే పదే దాడులు చేసినటువంటి అవినాష్ రెడ్డి గూండాలని నియంత్రించకపోతే ఈ సమాజంలో ఇటువంటి గూండాలు ,రౌడీలు మర్డర్ లు, దౌర్జన్యాలతో చెలరేగిపోయే ప్రమాదం ఉందని , తక్షణమే కర్నూల్ లో వైసిపి గుండాల్ని అవినాష్ రెడ్డి రౌడీలను నియంత్రించి శాంతిభద్రతలను పరిరక్షించాలని, సిబిఐకి మీరు సంపూర్ణ మద్దతు అందించాలని అన్నారు.