గత పది రోజులుగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు, చెత్తకుండీల ఏర్పాటు,దోమల సమస్య, పంట కాలువల పూడిక, మునిసిపల్ కార్మికుల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ యంత్రాంగానికి తెలియచేస్తుంటే.. తప్పుల్ని సరిదిద్దుకొని ప్రజలకి మంచి చేయాల్సిన పదవుల్లో ఉన్న వ్యక్తులు అర్థం లేని మాటలతో పిచ్చి ప్రేలాపనలు చేయడం విడ్డూరంగా ఉందని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆయన చేపట్టిన 'క్లీన్ నెల్లూరు'కార్యక్రమం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్, ఏసీ నగర్ పరిసర ప్రాంతాలను కేతంరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన అధికారులు నెల్లూరును చెత్త నగరంగా మార్చి వేశారని, పన్నులు వసూలు చేసే ఈ విషయంలో ఉన్న శ్రద్ధ పారిశుద్ధ్య నిర్వహణపై లేదని ఆయన అన్నారు. ఒక్క చోట కూడా సక్రమమైన చెత్తకుండీలు లేవని విరిగిపోయిన, పగిలిపోయిన చెత్త కుండీల వలన చెత్తంతా రోడ్లపై స్వైరవిహారం చేస్తోందని, దీంతో దోమల బెడద ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గుంతల మయమైన రోడ్లపై, చెత్త తో నిండిపోయిన పంట కాలవ లపై దృష్టి పెట్టడం మానేసి కాంట్రాక్టుల కోసం వేసిన రోడ్లపై మళ్ళీ రోడ్లు వేస్తూ. కట్టినన కాలువలపై మళ్ళీ కాలువలు కడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ఘనత వైసిపి ప్రభుత్వ పెద్దలకే దక్కుతుందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే అది మంత్రి గారి ఆస్తుల విషయంలో వాహనాలను కొనుగోలు విషయంలో మాత్రమే జరిగిందని, ప్రజల విషయంలో మాత్రం జరగలేదని ఆయన ఎద్దేవా చేశారు..ప్రజల్లో తిరుగుతూ ఉంటే జనసేనకు ఉన్న ఆదరణ తెలుస్తూ ఉందని, రానున్న రోజుల్లో నెల్లూరు ప్రజల శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జనసేన పార్టీ విస్తృత స్థాయిలో పని చేస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, పత్తి రాము, కుక్కా ప్రభాకర్, వెంకట్, హేమంత్ రాయల్, హరీశ్, మహేష్, జీవన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com