కర్నూలు ( జనస్వరం ) : ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏమి చేశారని ఈ బస్సు యాత్ర కర్నూలు జిల్లా నాయకులు ప్రతిపక్షాల విమర్శించడానికి మాత్రమే వీడియో ముందుకు వస్తున్నారు. జిల్లాలో రైతుల ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని జిల్లాలో బహిరంగ సభ పెట్టిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మాత్రం సమయం ఉంటుంది. కానీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పలకరించడానికి సమయం ఉండదా నే పాలకులను నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నామని జనసేన ఎరుకుల పార్వతి అన్నారు. ఆమె మాట్లాడుతూ సరైన దిగుబడి లేక పంట నష్టం వస్తే అప్పు తెచ్చిన డబ్బును కట్టలేక ఆ ఒత్తిడి వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్న అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని కుటుంబం పెద్ద మృతిచెందితే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుందని కుటుంబం మొత్తం ఆ కుటుంబం పెద్ద పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆత్మహత్య చేసుకునే కుటుంబాలు కర్నూలు జిల్లాలో ఒకటే కదని రాయలసీమలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయని ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో కుటుంబాలలో బీసీలు కూడా ఎందరో ఉన్నారని మరి ఓటర్లగా మాత్రమే గుర్తుకొస్తారనీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఉన్నాయా లేకపోతే వలసలు వెళ్లారా ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి కనీసం నియోజవర్గ నాయకులు జిల్లా నాయకులు పలకరించారని ఆవేదన వ్యక్తపరిచారు. పదవులు శాశ్వతం కాదని ఇది గుర్తుంచుకోవాలని రాయలసీమలో ఇంతమంది నాయకులు ఉండి కూడా నోరు మెదపకపోవడం అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటు అభివృద్ధి జరిగి ఉంటే రాయలసీమ నుండి వలసలు వెళ్తారా ఆత్మహత్యలు చేసుకుంటారని జనసేన ఎరుకుల పార్వతి అన్నారు. అంతేకాకుండా చదువుకున్న నిరుద్యోగ యువకులు డిగ్రీ ఇంటర్మీడియట్ చేసి కూడా చివరకు పెయింటర్ వవర్కరగా తాపీ మేస్త్రి గారు హమాలీలుగా మారిపోయారని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిక్షణం రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారని అంతేకాకుండా ముఖ్యంగా యువతకు రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారని యువతకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడని జనసేన ఎరుకుల పార్వతి అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com